Site icon Prime9

Ram Gopal Varma : సీఎం జగన్ తో రామ్ గోపాల్ వర్మ భేటీ

Ram Gopal Varma

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు. గతంలో సినిమా టికెట్ల ధరలపై వివాదం చెలరేగినప్పుడు వర్మ నాటి మంత్రి పేర్ని నాని తో సమావేశమయ్యారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సీఎం జగన్ తో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

వర్మ బుదవారం సీఎం జగన్‌ ను కలిసారని ఆయనతో కలిసి వర్మ లంచ్‌ చేసినట్లు సమాచారం. అయితే వీరి భేటీ వెనక కారణం మాత్రం తెలియలేదు. ప్రతీ విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వర్మ ఈ విషయాన్ని పంచుకోలేదు. ఇది కేవలం వ్యక్తిగత భేటీ అని అందుకే వర్మ దీనిపై సమాచారం పంచుకోలేదని తెలుస్తోంది. అందుకే వర్మ మీడియాను కలవకండా వెళ్లిపోయారని సమాచారం.

Exit mobile version