Site icon Prime9

Rajahmundry: వారం రోజులపాటు రాజమండ్రి వంతెన మూసినేత

rajahmandri road come railway bridge closed

rajahmandri road come railway bridge closed

Rajahmundry: ఏపీలోని రాజమండ్రిలో రోడ్‌ కమ్‌ రైలు వంతెనపై నేటి నుంచి వారం రోజులపాటు రాకపోకలు అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. మరమ్మతుల కోసం వంతెనను మూసివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

వారంరోజుల రాజమండ్రి వంతెనను మూసివేత నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ, గామన్‌ వంతెన మీదుగా వాహనాలను మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 17న రాజమండ్రి వంతెన మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర జరుగనుంది. ఈ తరుణంలోనే వంతెన మరమ్మతుల కోసం మూసివేస్తున్నామంటూ జిల్లా కలెక్టర్‌ ప్రకటించడంపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మా పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని అమరావతి రైతు ఐకాస కో కన్వీనర్‌ గద్దె తిరుపతిరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయని ఆరోపించారు. రాజమహేంద్రవరం వంతెనపై రాకపోకలు జరిపేందుకు స్థానికులు ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం మరమ్మతులకు పూనుకోవడం సంతోషకరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వంతెన మూసినంత మాత్రాన తమ మనోధైర్యం దెబ్బతినేదేమీ లేదని పాదయాత్ర మరో రెండు రోజుల ఆలస్యంగా జరుగుతుందని అంతే కానీ మా హక్కల సాధించేంత వరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న మార్గాల్లోనే పాదయాత్ర కొనసాగుతుందని తిరుపతిరావు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: “వివేకానందరెడ్డిని హత్య చేసింది మేమే”.. కేసుకు అడ్డుపడుతున్నారు..!

Exit mobile version