Site icon Prime9

Gas Cylinder Rate: పండుగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు

gas cylinder latest prices

gas cylinder latest prices

Gas Cylinder Rate: దసరా పండుగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్. గ్యాస్ బండ ధరను తగ్గిస్తున్నట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. అది కూడా వాణిజ్య సిలిండర్లు వినియోగించే వారికే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని పేర్కొనింది.

ప్రతి నెల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు కంపెనీలు సవరిస్తుంటాయి. కాగా పండుగ నేపథ్యంలో వాణిజ్య సిలిండర్లు వాడే వారికి కేంద్రం తీపి కబురు చెప్పింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచి రూ.25.5 తగ్గనుంది. ఈ ఉపశమనం కేవలం వాణిజ్య సిలిండర్ల వినియోగించేవారికి మాత్రమేనని వెల్లడించింది. కాగా డొమెస్టిక్ LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చెయ్యలేదు. ప్రముఖ పట్టణాలైన కోల్‌కతాలో రూ.36.5, ముంబైలో రూ.32.5, చెన్నైలో రూ.35.5 సిలిండర్ ధర తగ్గినట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. కాగా ఈ కొత్త రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి.

ధరల మార్పు తర్వాత 19 కిలోల సిలిండర్ ఢిల్లీలో 1885 నుంచి రూ. 1859.5గా తగ్గింది. అదే సమయంలో కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ 1995.5 నుంచి రూ. 1959గా, ముంబైలో రూ.1844 నుంచి రూ.1811.5కి తగ్గింది. చెన్నైలో రూ.2045 నుంచి రూ.2009.5కి తగ్గింది.

ఇదీ చదవండి: కేదార్ నాథ్ క్షేత్రం.. చూస్తుండగానే విరిగిపడిన మంచుచరియలు

Exit mobile version