Odissa Singer: స్టేజ్ పైనే కుప్పకూలిన ప్రముఖ సింగర్

ప్రముఖ ఒడియా గాయకుడు మురళీ మోహపాత్ర ఇకలేరు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దుర్గాపూజ మండపంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన ఇస్తుండగా స్టేజిపైనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Odissa Singer: ప్రముఖ ఒడియా గాయకుడు మురళీ మోహపాత్ర ఇకలేరు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దుర్గాపూజ మండపంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన ఇస్తుండగా స్టేజిపైనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని జెయోర్ పట్టణంలో రాజనహర్ పూజా మండపంలో ప్రదర్శన ఇస్తుండగా మురళీపాత్ర ఒక్కసారిగా స్టేజిపైనే కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడే తోటి గాయకులు ఆయనను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మురళీ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సుదీర్ఘ నాలుగు గంటల పాటల ప్రదర్శన అనంతరం ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారని ఈ క్రమంలోనే అర్థరాత్రి గుండెపోటుతో మురళీ మరణించారని ఆయన సోదరుడు బిభూతి ప్రసాద్ మోహపాత్ర మీడియాకు తెలిపారు.

మురళి మరణ వార్త తెలియగానే ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మురళి మోహపాత్రను జైపూర్‌కి చెందిన అక్షయ మొహంతి అని కూడా పిలుస్తారు.
ఎందుకంటే ఆయన గాయకుడిగా మారడానికి ముందు జైపూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేశారు. మహపాత్ర మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించారు. “ప్రముఖ గాయకుడు మురళీ మోహపాత్ర మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన మధురమైన గాత్రం శ్రోతల హృదయాలను ఎప్పటికీ ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ సీఎం తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక సింగర్ మురళీ ఇకలేరన్న వార్త విన్న ప్రముఖ గాయకులు సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థించారు.

ఇదీ చదవండి:  డీజీపీ దారుణ హత్య.. గొంతు కోసి ఆపై కాల్చి..!