Site icon Prime9

Loan apps: మరో ప్రాణం తీసిన లోన్ యాప్స్

man suicide with loan App harassments

man suicide with loan App harassments

Loan apps: లోన్ యాప్స్ వేధింపులకు ఏపీలోని మరో ప్రాణం బలయ్యింది. మైక్రో ఫైనాన్స్ మరియు లోన్ యాప్స్ ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. దీనితో చేసేదేం లేక ఇప్పటికే చాలామంది యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో లోన్‌యాప్‌ అరాచకానికి మరో యువకుడు ప్రాణం తీసుకున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సబ్‌స్టేషన్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి షిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. కాగా అతను పలు లోన్‌యాప్‌ల నుంచి రుణాలు తీసుకున్నాడు. కొద్ది కాలానికి లోన్‌లన్నింటినీ చెల్లిస్తూ వచ్చాడు. కాగా తీసుకున్న లోన్‌ చెల్లించినప్పటికీ ఇంకా కట్టాలంటూ లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు పెరిగాయి. దానితో ఏం చెయ్యాలో పాలుపోక శ్రీనివాస్‌ ఆదివారం నాడు ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లోన్‌ యాప్‌కు కట్టాల్సిన డబ్బులు చెల్లించినా ఇంకా కట్టాలంటూ శ్రీనివాస్‌ను వేధింపులకు గురి చేశారని ఈ కారణంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ మంగాదేవి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఆమె వెల్లడించారు.

ఇటీవల కాలంలో లోన్ యాప్ ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. వాటి ఆగడాలకు అమాయకుల ప్రాణాలు గాల్లోకలిసిపోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లోన్‌ యాప్‌లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అనుమతి లేని లోన్‌ యాప్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీచేసింది. అయినప్పటికీ ఈ లోన్‌ యాప్స్‌ వేధింపులు పెరిగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర.. పోలీసుల ఎంట్రీతో..!

Exit mobile version