Site icon Prime9

Hyderabad: హైదరాబాదులో మరోసారి ఐటీ దాడులు.. ఆర్ఎస్ బ్రదర్స్ లో సోదాలు

income tax department rides on rs brothers

income tax department rides on rs brothers

Hyderabad: హైదరాబాదులో మరోసారి ఐటీ శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. వస్త్ర వ్యాపారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సంస్థ అయిన ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాలు, నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్, వారికి సంబంధించిన కార్యాలయాలు, నివాసాల్లో ఏకకాలంలో ఆదాయ పన్నుల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ వారు ఇటీవల ఆనర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వాసవి, సుమధర రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆనర్స్ పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 15 ఐటీ బృందాలు కలిసి ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ పైనే కాకుండా, వాసవి, సుమధర సంస్థలకు చెందిన ఆస్తులు, నివాసాల్లోనూ ఏకకాలంతో తనిఖీలు చేపట్టాయి.

ఇదీ చదవండి: వివాహితను బైక్​తో ఢీ కొట్టి.. ఆపై అత్యాచారం..!

Exit mobile version