Site icon Prime9

IT Raids : మైత్రీ మూవీ మేకర్స్ సంస్దల్లో ఐటీ దాడులు

IT Raids

IT Raids

IT Raids : మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయి. మొత్తం పదిహేను చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇళ్లలోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థకు చెందిన కార్యాలయాలు, నిర్మాత ఇళ్లపై కూడా ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుపుతుంది.

మైత్రీ మూవీస్ నిర్మించిన పుష్ప, సర్కార్ వారి పాట ఈ ఏడాది మంచి విజయాలను సాధించాయి. పుష్ప 2 సీక్వెల్ షూటింగ్ ప్రారంభమయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్‌సింగ్ ‘ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సంస్ద నిర్మించిన రెండు భారీ చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.

 

Exit mobile version