Site icon Prime9

Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఇల్లు, కార్యాలయాలపై తనిఖీలు

malla-reddy-not-attending-for-it-Enquiry

malla-reddy-not-attending-for-it-Enquiry

Minister Mallareddy: తెలంగాణలో ఐటీ శాఖ మెరుపుదాడులు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై తెల్లవారు జామునుంచే ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. మల్లారెడ్డి కుమారుడు, అల్లుడి ఇంట్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లోని పలు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి. మహేందర్ రెడ్డికి చెందిన కోంపల్లిలోని పాంమెడోస్‌ విల్లాలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. దాదాపు 50 బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మరోవైపు మల్లారెడ్డి యూనివర్సిటీ, కాలేజీల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కొడుకు ఆత్మహత్య

Exit mobile version