IND vs ZIM: టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశను భారత్ భారీ విజయంతో ముగించేసింది. ఇవాళ అనగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగులతో తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 71 పరుగులతో విజయం సాధించి గ్రూప్-2లో మొదటి స్థానంలో నిలిచింది.
ఇక నవంబర్ 10వ తేదీన జరిగిన రెండో సెమీస్‌లో భారత్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. కేఎల్ రాహుల్ 51 చెయ్యగా, సూర్యకుమార్ 59 చేశాడు. ఇక పాండ్యా 30 పరుగులు చేశారు. స్టార్ ప్లేయర్స్ అయిన విరాట్ 26, రోహిత్ 15లు మాత్రం తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. దినేష్ కార్తిక్ స్థానంలో బరిలోకి దిగిన పంత్ 3 పరుగులు మాత్రమే చేసి 187 పరుగుల టార్గెట్ జింబాబ్వే ముందు ఉంచింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే బ్యాటర్లు విషలమయ్యారు.
ఇదీ చదవండి: సెమీస్ కు దూసుకెళ్లిన పాకిస్తాన్.. బంగ్లాపై గెలుపు