Site icon Prime9

Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్రిక్తత

high tension-in-the-visakha-steel-plant-when-the-workers-besieged-the-admin-building

high tension-in-the-visakha-steel-plant-when-the-workers-besieged-the-admin-building

Visakha Steel Plant: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత కొద్ది రోజులుగా ఎన్నో ఉద్యమాలు జరుగుతున్న సంగంతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు తాజాగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్రిక్తత నెలకొంది. అడ్మిన్‌ బిల్డింగును ఉక్కు కార్మికులు ముట్టడించారు. దీంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

స్టీల్‌ప్లాంట్‌లో అదానీ బృందం పర్యటిస్తోందని, వారు ఎందుకు వచ్చారు?, వారికి ఏమి చెప్పారో తమకు వెల్లడించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నాయకులు ప్లాంటు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. అయితే యాజమాన్యం మాత్రం అదానీ బృందం ఏమీ రాలేదని, స్టీల్‌ప్లాంట్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు మాత్రమే వచ్చారని, వారికి ఇక్కడి పరిస్థితులు వివరిస్తున్నామని తెలిపారు.

అయితే యాజమాన్యం మాటలు నమ్మని కార్మిక నాయకులు, ఇండిపెండెంట్‌ డైరెక్టర్లకు ప్లాంట్‌ టౌన్‌ అడ్మినిస్ట్రేషన్‌ భవనం వద్ద ఏం పని అని, ప్లాంట్‌ భూములు పరిశీలన కోసమే వచ్చారా అంటూ నిలదీశారు. పరిపాలనా భవనంలోనికి వెళ్లేందుకు కార్మిక నేతలు ప్రయత్నించగా పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది  వారిని అడ్డుకున్నారు. ప్లాంట్‌ ఉత్పత్తిని గాలికి వదిలి ప్రైవేట్‌ పరం చేసే ఆలోచనలో యాజమాన్యం ఉందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌ ప్రజల ఆస్తి అని, దాని జోలికొస్తే సహించేది లేదన్నారు. ప్లాంట్‌లోకి ప్రైవేటు వ్యక్తులు వచ్చేందుకు యత్నించినా, యాజమాన్యం సహకరించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఏపీ కొత్త సీఎస్‌గా కేఎస్ జవహర్ ‌రెడ్డి..?

Exit mobile version
Skip to toolbar