Breaking News: కారు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబాయి కారు ప్రయాణం చేస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆయన వెళ్తున్న కారు పాల్‌ఘడ్‌ జిల్లాలో సూర్యనదిపై ఉన్న డివైడర్ ఢీకొని సైరస్ మిస్త్రీ గారు అక్కడే మృతి చెందారు.

  • Written By:
  • Updated On - April 21, 2023 / 06:56 PM IST

Cyrus Mistry:  టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబాయి కారు ప్రయాణం చేస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆయన వెళ్తున్న కారు పాల్‌ఘడ్‌ జిల్లాలో సూర్యనదిపై ఉన్న డివైడర్ ఢీకొని సైరస్ మిస్త్రీ గారు అక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో అతనకు తీవ్ర గాయాలు అవ్వడంతో వెంటనే మృతి చెందినట్టు గుర్తించారు. కారు డ్రైవర్‌తో పాటు, ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారని వీరిని ఓ హాస్పిటల్లో చేర్చారాని తెలిసిన సమాచారం.

ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుందని ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది కానీ ఇంకా ఈ ప్రమాదం గురించి అసలు వివరాలు తెలియాలిసి ఉంది. 2006లో టాటా గ్రూప్‌ మెంబరుగా చేరి 2012 నుంచి 2016 వరకు టాటా సన్స్‌ ఛైర్మన్‌గా పని చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. సైరస్ మిస్త్రీ మృతి పట్ల వ్యాపారవేత్తలు , రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

టాటా సన్స్‌కు ఆరో ఛైర్మన్‌గా ఆయన పని చేశారు ఆ తరువాత మిస్త్రీని 2016లో ఆయన్ని పదవి నుంచి తొలగించారు.రతన్ టాటా రిటైర్మెంట్ తర్వాత డిసెంబర్ 2012లో సైరస్ మిస్త్రీ ఛైర్మన్‌ బాధ్యతలు చేపట్టారన్న మన అందిరికి తెలిసిందే.