Site icon Prime9

Hyderabad: తండ్రీకొడుకుల దారుణ హత్య

father and son brutally murder in uppal

father and son brutally murder in uppal

Hyderabad: భాగ్యనగరం జంట హత్యలతో మరోసారి ఉలిక్కిపడింది. ఈ ఘటన ఉప్పల్‌లో కలకలం రేపుతోంది. తండ్రికొడుకులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.

హైదరాబాద్ ఉప్పల్లో జంటహత్యలు మరోసారి కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం ఉదయం తండ్రి నర్సింహశర్మ, కొడుకు శ్రీనివాస్‌లను కత్తులతో పొడిచి అతి కిరాతకంగా చంపేశారు. తండ్రిపై దాడి చేస్తున్న సమయంలో కొడుకు అడ్డుకోవడంతో అతన్ని కూడా చంపేసినట్టు తెలుస్తోంది. కాగా వారిరువురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ హత్యను తమ బంధువులే చేయించి ఉంటారంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఆస్తి తగాదాల వల్లే నర్సింహ చెల్లెలు శోభ, ఆమె భర్త శ్యాంసుందర్‌, తమ్ముడు శేషయ్యలు ఈ హత్యలు చేయించి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ జంటహత్యలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: 2023 పది పరిక్షల్లో 6 పేపర్లే.. తెలంగాణ ప్రభుత్వం

Exit mobile version