Site icon Prime9

Dalith Sisters Hanging: దారుణం… చెట్టుకు వేలాడుతూ దళిత మైనర్ అక్కాచెలెళ్ల మృతదేహాలు

Basara IIT

Basara IIT

Dalith Sisters Hanging: ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ ఖేరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఊరి చివర చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో కనిపించాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపుర్ ఖేరీలోని నిఘాసన్​ పోలీస్​ స్టేషన్​ పరిధికి చెందిన ఇద్దరు దళిత బాలికలను ఆరుగురు నిందితులు… మాయమాటలు చెప్పి గ్రామ శివార్లలోని పొలానికి తీసుకెళ్లి వారిపై అఘాయిత్నానికి పాల్పడ్డారు. కాగా ఆ అక్కచెల్లెళ్లు తమని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెయ్యగా వారిని గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశారు. వారిపై అనుమానం రాకుండా ఉండేందుకు హత్యను కాస్త ఆత్మహత్య సృష్టించారని… చెట్టుకు మృతదేహాలను వేలాడదీశారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లుగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. తమ కూతుర్లని పట్టపగలే కిడ్నాప్ చేశారని… వారిపై అత్యాచారం చేసి హత్యచేశారని మృతుల తల్లి ఆరోపిస్తున్నారు. అదే కాకుండా తమ అనుమతి లేకుండా పోలీసులు పోస్టుమార్టం జరిపించారని బాధితురాళ్ల తండ్రి వాపోతున్నారు. కాగా ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ.. యోగి ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేసింది.

ఇదీ చూడండి: Hyderabad: పాతబస్తీలో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

Exit mobile version