Site icon Prime9

Rebel Star Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంపై రాజకీయ ప్రముఖుల దిగ్బ్రాంతి

krishnam raju dead

krishnam raju dead

Rebel Star Krishnam Raju: టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులే కాక రాజకీయ నాయకులు  దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణానికి సంతాపం తెలియజేశారు. దేశ ప్రజలకు కృష్ణంరాజు మరణం బాధాకరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన 57 ఏళ్ల సినీ ప్రస్థానంలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ‘రెబల్ స్టార్’ గా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణంరాజు మరణం.. వెండితెరకు తీరని లోటని సీఎం పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.

సినీనటుడు కృష్ణంరాజు ఇక లేరన్న విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా రెబల్ స్టార్ మరణ వార్తపై స్పందించారు. కేంద్ర మాజీ మంత్రి, నటులు శ్రీ ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గారు చనిపోవడం అత్యంత విచారకరమని.. మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా తెలిపారు.

మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తెలుగు సినిమాల్లోని ప్రముఖ నటుల్లో కృష్ణంరాజు ఒకరని అన్నారు. ఆయన మరణం తెలుగు సినీపరిశ్రమకు తీరని లోటంటూ.. ప్రభాస్ కు ఆయన ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఇక లేరన్న వార్త దిగ్భ్రాతి కలిగించింది. ఆయన మరణం తెలుగు చిత్ర రంగానికి తీరని లోటు అని.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Rebel Star Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.

Exit mobile version