Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి స్టేజ్ పై ఉండగానే శరీరంలో చక్కెర శాతం పడిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు. దానితో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయనను పక్కన ఉన్న గ్రీన్ రూమ్ లోకి విశ్రాంతి కోసం తీసుకెళ్లారు. వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సిలిగురి నుంచి సీనియర్ డాక్టరును పిలిపించి సెలైన్ ఎక్కించారు.
గడ్కరీకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గాయని డాక్టర్లు తెలిపారు. అనంతరం డార్జిలింగ్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజు బిస్తా నితిన్‌ను కారులో తన ఇంటికి తీసుకెళ్లారు. మతిగరలోని ఆయన స్వగృహంలో కేంద్రమంత్రికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వారి వెంట వైద్యులు కూడా ఉన్నారు. సిలిగురిలో 1206 కోట్ల రూపాయలతో చేపట్టే జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ నేడు శంకుస్థాపన చేశారు. సిలిగురిలో వేడుక ముగిసిన తర్వాత, అతను దల్ఖోలాకు వెళ్లాల్సి ఉండగా అనారోగ్య కారణాల దృష్ట్యా పర్యటన రద్దయ్యే అవకాశాలున్నాయి.
ఇకపోతే గడ్కరీ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా గడ్కరీ ఆరోగ్యంపై ఆరా తీశారు.
ఇదీ చదవండి: వివాదాస్పదంగా కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ బర్త్ డే.. హనుమంతుని ఫోటోతో ఆలయ ఆకారంలో కేక్