Viral News: సాధారణంగా ఎవరైనా చనిపోతే.. ఒకరోజు లేదా రెండు రోజులు మహాయితే ముఖ్యమైన వాళ్లు రావాల్సి ఉంటే ఒక వారం రోజు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఓ ఫ్యామిలీ మాత్రం ఇందుకు భిన్నంగా ఏకంగా ఏడాదిన్నర కాలం డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచుకుంది. ఆఖరికి విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి గ్రామంలో విమలేశ్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసముంటున్నారు. విమలేశ్ అహ్మదాబాద్‌లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ 2021 ఏప్రిల్ 22న మరణించాడు. కాగా అతని కుటుంబసభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచుకున్నారు. అతను చనిపోయారన్న విషయం బయటకు వ్యాపించకుండా జాగ్రత్తవహించారు. కొద్దిరోజులుగా విమలేశ్ కనిపించకపోవడంతో గ్రామస్థులు ఆరా తీశారు. అయితే విమలేశ్ అనారోగ్యంతో కోమాలో ఉన్నాడని వైద్యులు చికిత్స చేస్తున్నారని అతని కుటుంబ సభ్యులు అందరినీ నమ్మించారు. అయితే విమలేశ్ భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తోంది. కాగా తాజాగా ఆమె పెన్షన్ కు అప్లై చేసుకునేందుకు విమలేశ్ మరణధ్రువీకరణ పత్రాన్ని బ్యాంకులో సమర్పించింది. దీనితో అసలు విషయం బయటకు వచ్చింది. వెంటనే అప్రమత్తమయిన ఆదాయ పన్నుశాఖ ఈ విషయాన్ని సీఎంవోకు వివరించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎంఓ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
దానితో పోలీసులు విమలేశ్ ఇంటికి చేరుకుని, అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. డెడ్ బాడీని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు.. విమలేశ్ మృతదేహం పూర్తిగా చెడిపోయిందని వివరించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఏడాదిన్నరగా ఇంట్లో మృతదేహాన్ని ఎలా ఉంచుకుంటారంటూ కుటుంబ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం అక్కడ పెను సంచలనంగా మారింది.
ఇదీ చదవండి: YCP Leader Murder: ఏపీలో మరో వైసీపీ యువనేత దారుణ హత్య..!