Boat Accident: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరటోయా నదిలో ఓ పడవ బోల్తా పడటం వల్ల 23 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయ్యారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 468 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర పంచాగఢ్ జిల్లాలోని కరటోయా నదిలో పడవ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో పడవలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే నీటమునిగి దాదాపు 23 మంది మృతి చెందారు. మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తియ్యగా మృతుల్లో ఎక్కువగా పిల్లలు, మహిళలు ఉన్నారని ఉత్తర పంచగఢ్ జిల్లా కలెక్టర్ జహురుల్ ఇస్లాం తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతం లోతట్టు జల మార్గాలను కలిగి ఉండడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపుతున్నారు.
ఇదీ చదవండి: Gang Rape: జహీరాబాద్లో వివాహితపై గ్యాంగ్ రేప్