Prime9

Nara Chandrababu : జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. ఇక నేరుగా అక్కడికే

Nara Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల రిమాండ్ తర్వాత నేడు బయటికి వచ్చారు. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.  కాగా చంద్రబాబు విడుదల క్రమంలో కుటుంబ సభ్యులు కూడా జైలు వద్దకు వచ్చారు. నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ జైలు గేటు వద్ద చంద్రబాబుకు స్వాగతం చేశారు. భారీ జనసందోహం నడుమ నడుచుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. 

తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేయడాన్ని తాను ఏనాడూ కూడ సమర్ధించబోనని చంద్రబాబు వివరించారు. తాను ఏనాడూ తప్పు చేయలేదు, చేయను, చేయబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు.హైద్రాబాద్ లో ఐటీ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీల గురించి చంద్రబాబు ప్రస్తావించారు.తనకు సంఘీభావం ప్రకటించిన అన్ని పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను జైలులో ఉన్న సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తనకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లోని కొందరు నేతలకు తనకు సంఘీభావం తెలిపారన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు తన కోసం ఆందోళనలు నిర్వహించారన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి సైకిల్ యాత్రలు, పాదయాత్రలు నిర్వహించిన విషయాన్ని చంద్రబాబు వివరించారు. అంతేకాదు తాను జైలు నుండి విడుదల కావడం కోసం ప్రత్యేక పూజలు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.తనపై ప్రజలు చూపిన అభిమానాన్ని తాను ఏనాడూ మర్చిపోలేనని చంద్రబాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లో కూడ తనకు సంఘీభావం తెలిపారన్నారు. తాను చేపట్టిన విధానాల వల్ల లబ్దిపొందినవారంతా మద్దతిచ్చారన్నారు.

YouTube video player

Exit mobile version
Skip to toolbar