Prime9

YS Jagan: వైఎస్ జగన్ పర్యటన.. పొదిలిలో తీవ్ర ఉద్రిక్తత

High Tension In Podili: ప్రకాశం జిల్లా పొదిలిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పొదిలి పర్యటనకు వెళ్లారు. అక్కడ పొగాకు రైతులను పరామర్శించి.. వారితో ముఖాముఖి అవాలని నిర్ణయించారు. కానీ పొదిలిలో వైఎస్ జగన్ తెలుగు మహిళల నుంచి నిరసన సెగ ఎదురైంది. గో బ్యాక్ జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలు, బెలూన్లతో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు బెస్తపాలెం వద్ద జగన్ కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసిరారు.

 

దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణులకు మధ్య వివాదం చెలరేగి పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. కాగా గొడవలో పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి కేసు నమోదు చేశారు.

కాగా పొదిలిలో జరిగిన ఉద్రిక్తతపై మంత్రి నారా లోకేశన్ స్పందించారు. తెలుగు మహిళలు, పోలీసులపై వైసీపీ సైకోల దాడిని ఖండించారు. రాళ్ల దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్ మొన్న తెనాలి గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లను ఓదార్చారని, ఇవాళ తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కూసిన వారికి మద్దుతుగా ఉంటున్నారని మండిపడ్డారు. అయినా సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేశారు అని నారా లోకేశ్ అన్నారు. వారిద్దరినీ కోర్టుల చుట్టూ తిప్పాడని ఎద్దేవా చేశారు. పొదిలిలో మహిళలపై వైసీపీ నేతలు చేసిన దాడులకు జగన్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Exit mobile version
Skip to toolbar