Prime9

Union Minister Kishan Reddy: ఏపికి ఒక్కటే రాజధాని.. అది కూడా అమరావతే.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి

Amaravati: ఆంద్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశం లేదని, ఒక్కటే రాజధానిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ శంఖు స్ధాపన చేసిన అమరావతినే రాజధానిగా ఆయన స్పష్టం చేశారు.

పీఎం కిసాన్ పధకం కింద 16వేల కోట్ల రూపాయలను రైతులకు అందిస్తున్న 12వ విడత నిధుల విడుదల నేపథ్యంలో ఏలూరు రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయం చేరుకొన్న కేంద్ర మంత్రికి భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడిన మేరకు, రాజకీయాల్లో ఎక్కడైనా కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదని అన్నారు. మొదట్నుంచీ భాజపా పార్టీ అదే చెబుతోందని తెలిపారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతివక్కరికి ఉంటుందన్నారు.

ఏపీలో మూడు రాజధానుల అంశంతో ప్రభుత్వం ముందుకు పోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు అన్నీ ఒకటైనాయి. దీంతో విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ ప్రభుత్వం హోటల్ కే పరిమితం చేసింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి మాటలు మరింత కాక పుట్టిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Somu Veerraju: 2024వరకు ఏపీకి భాజపా అధ్యక్షుడుగా సోము వీర్రాజు

Exit mobile version
Skip to toolbar