Site icon Prime9

Viral News: క్రేజీ మ్యాన్.. పెళ్లిపీటల మీద కూడా ల్యాప్ టాప్ తో వర్క్

youth-works-on-laptop-while-his-marriage-being-done

youth-works-on-laptop-while-his-marriage-being-done

Viral News: కరోనా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రం హోమ్ కు అలవాటు పడ్డారు. కంపెనీలు కూడా సంగం ఖర్చులను తగ్గించుకునేందుకు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిని ఇచ్చారు. అయితే వర్క్ ఫ్రం హోం వాళ్లకు సెలవులు ఇవ్వడం కాస్త కష్టమే. ఈ నేపథ్యంలో పలు వేడుకలు చాలా మంది దూరం అవుతున్నారు. మరి కొందరైతే ఆన్ లైన్ ద్వారా వేడుకలను తిలకిస్తున్నారు. ఇదిలా ఉంటే మరి వర్క్ ఫ్రం హోం ఉండి పెళ్లి చేసుకునే వారి సంగతి ఏంటంటారు. అందులోనూ వారికి సెలవు ఇవ్వకపోతే ఓ సారి ఊహించండి. ఊహే కొంచెం నవ్వు తెప్పిస్తుంది కదా. అచ్చం ఇలానే ఇప్పుడు నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా ఓ యువకుడు పెళ్లి పీటల మీద కూడా ల్యాప్ టాప్ పట్టుకుని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు ఆ ఫొటోలో కనిపిస్తుంది.

ఫొటోలో కనిపిస్తున్న యువకుడు కూడా వర్క్ ఫ్రమ్ హోంలో పనిచేస్తూనే, మరోవైపు పెళ్లినాటి ప్రమాణాలు ఆచరిస్తుండడం సోషల్ మీడియా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. మనవాడు వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని మరో లెవెల్ కు తీసుకుపోయాడని కొందరు, ఉద్యోగాన్ని, పర్సనల్ లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ యువకుడిని చూసి నేర్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు. పెళ్లి రోజైనా తనని ఆనందంగా ఉండనివ్వరా? అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. ఇలా ఈ ఫోటో వైరల్ గా మారుతుంది. కాగా ఈ ఫోటోను కలకత్తాలోని ఇన్ స్టా గ్రామ్ యూజర్ షేర్ చేశారు.

ఇదీ చదవండి: ఇది బైక్ కాదు భయ్యో.. మినీ బస్

Exit mobile version