Prisons DIG Ravi Kiran: చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ అన్నారు. దీనికి సంబంధించి నారా లోకేష్ చేసిన ట్వీట్ పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
చంద్రబాబుకు ప్రతిరోజూ వైద్య పరీక్షలు..(Prisons DIG Ravi Kiran)
జైలులో చంద్రబాబుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాము. ఒక హెడ్ వార్డర్, ఆరుగురు వార్డర్లు వున్నారు. ఒక జైలర్ ను పూర్తిగా ఆయనకే కేటాయించడం జరిగింది. ఎస్పీగారు కూడా ఎప్పటికపుడు మాకు సూచనలు ఇస్తున్నారు. వాటిని మేము అనుసరిస్తున్నాము. అందువలన భద్రతకు సంబంబంధించి ఎటువంటి సమస్యలేదు. మావద్ద ముగ్గురు హెల్త్ ఆఫీసర్లు వున్నారు. చంద్రబాబు వాడే మందుల గురించి తెలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాము. జైళ్ల సిబ్బంది ప్రతి రోజు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు హెల్త్‌పై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు. చంద్రబాబు జైలుకు వచ్చినపుడు ఆయన బరువు 66 కేజీలు ఉండగా ఇపుడు 67 కేజీలుగా ఉంది. మా వద్ద ఉన్న డెర్మటాలజిస్ట్ అనుభవం ఉన్న వ్యక్తి. నిన్న దద్దుర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో ఇద్దరు డెర్మటాలజిస్టులు వచ్చారు. వారు కొన్ని మందులను సిఫార్సు చేసారు. చంద్రబాబును ఉంచిన బ్యారెక్ చాలా విశాలంగా ఉందన్నారు. జైలులో తాగునీటికి ఎటువంటి సమస్య లేదన్నారు.