H-1B Visa: హెచ్ 1బీ, ఎల్ 1 వీసా పునరుద్దరణ ప్రక్రియ సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న ‘ డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ’ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అమెరికాలో నివసిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు , ముఖ్యంగా భారతీయులు ఎక్కువ మేలు జరగనుంది.
మళ్లీ రీవాలిడేషన్ విధానం(H-1B Visa)
గతంలో హెచ్ 1 బీ వీసీ ఉన్నవారు.. తమ వీసా స్టాంపింగ్ కోసం తమ స్వదేశానికి వెళ్లల్సిన అవసరం ఉండేది. 2004 వరకు ఇదే విధానం కొనసాగింది. అయితే ఆ తర్వాత ఈ ప్రక్రియలో మార్పులు చేశారు. హెచ్1 బీ వీసా రెన్యువల్ కోసం సొంత దేశాలకు వెళ్లి, అక్కడ అమెరికా కాన్సులేట్ ఆఫీస్ లో వీసా స్టాంపింగ్ వేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఈ విధానం అంత సులభంగా అయ్యేది కాదు. అమెరికా నుంచి స్వదేశానికి వీసా స్టాంపింగ్ కోసం వచ్చిన వారు.. తిరిగి అమెరికా వెళ్లాలంటే చాలా కాలం పట్టేది.
దీనిపై అనేక అభ్యర్ధనలను స్వీకరించిన విదేశీ వ్యవహారాల శాఖ పాత విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా వీసా రీవాలిడేషన్ విధానం చేపట్టాలని చూస్తోంది అమెరికా. ఈ ఏడాది చివరికి ఈ ప్రక్రియ ప్రారంభం కావొచ్చు. దీని వల్ల వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన పని తప్పుతుంది. ముందు తక్కువ సంఖ్యలో ప్రారంభించి.. రానున్న రెండేళ్ల లో పెంచుకుంటూ వెళతామని అధికారులు చెబుతున్నారు.
ఇకపై దేశం బయట కూడా వీసా స్లాట్
అమెరికా వీసాల కోసం ఇండియా లో పేరుకుపోయిన అప్లికేషన్లను త్వరగా క్లియర్ గా చేసే దిశగా మరో విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఇతర దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లోనూ వీసా స్లాట్ పొందే అవకాశం కల్పించాలని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఇటీవల కొన్ని సిఫారసులు చేసింది.
తాజాగా ఈ సూచనలను అగ్రరాజ్యం అమల్లోకి తీసుకొచ్చింది.
దీంతో వివిధ దేశాల్లో పర్యటిస్తున్న భారతీయులు.. దేశంలోని రాయబార కార్యాలయానికి రాకుండానే ఆయా దేశాల్లోని అమెరికా ఎంబసీల్లో వీసా అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు.
ప్రస్తుతం అమెరికాలోని పలు టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు లేఆఫ్స్ కు గురైన విషయం తెలిసిందే.
వారిలో భారతీయులు కూడా ఉన్నారు. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు వీసా పునరిద్ధురించేందకు చాలా టైమ్ పడుతుంది.
ఈ లోపల వీసా గడవు తీరితే అమెరికా వదిలి రావాల్సి ఉంటుంది. లేదా మరో ఉద్యోగం లో చేరి వీసా రెన్యూవల్ చేయించుకోవాలి. ఇక్కడే వీసా హోల్డర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
ఒక్క పక్క ఉద్యోగం పోయి.. మరో పక్క వీసా రెన్యూవల్ అనేసరికి చాలామంది ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వంపై విదేశీయులు ఒత్తిడి తీసుకువచ్చారు. వీసాల రెన్యూవల్ పద్ధతిలో మార్పులు చేయాలని కోరారు.
ఈ క్రమంలోనే వీసాల విషయంలో అమెరికా విధించిన పలు కండిషన్స్ ను మార్పు చేసింది.