Dost notification: తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల( Dost) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మూడు విడతల్లో చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. మే 16 వ తేదీ నుంచి జూన్ 10 వరకు దోస్త్ తొలి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయన్నారు. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 16 వ తేదీన మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
రెండు విడతలుగా..(Dost notification)
రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు జూన్ 16 వ తేదీ నుంచి 26 వరకు ఉంటాయని వెల్లడించారు. రెండో విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 16 నుంచి 27 వరకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. జూన్ 30 న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. మూడో విడత రిజిస్ట్రేషన్లు జులై 1 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. జులై 1 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. జులై 10న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జులై 17 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు.