Conspiracy on Prime 9: ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రసారాలు నిలిచిపోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనిపై తాను మాట్లాడతానని అన్నారు. ఆదివారం ఏలూరు లో ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధిని పలకరించిన పవన్ కళ్యాణ్ ప్రసారాలు నిలిచిపోవడంపై ఆరా తీసారు. వారాహి యాత్రకు ప్రైమ్ 9 న్యూస్ మంచి కవరేజీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రైమ్ 9 ప్రతినిధి పవన్ దృష్టికి తీసుకు వచ్చారు.
మరోవైపు పవన్ కల్యాణ్ ఆశయాలను బలపరుస్తూ, జనసేన ఎన్నికల ప్రచారాన్ని 24 గంటలు ప్రసారం చేస్తున్న ఒకే ఒక టీవి ఛానల్ ప్రైమ్ 9 ఛానల్ అని కాపు సంక్షేమ సేన వ్యవస్ధాపకులు హరిరామజోగయ్య అన్నారు. ఛానల్ ప్రసారాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమొత్తంగా నిలిపివేసిందని ఫైరయ్యారు. ప్రస్తుతం వారాహియాత్ర విశేషాలను ప్రజలకు అందకుండా అడ్డుకోవటానికే ఈ ప్రయత్నమని తెలిపారు. ఇది ప్రజాస్వామిక వ్యతిరేకమని.. రాజ్యాంగపరంగా ప్రజలకున్న హక్కులకు భంగం కలిగించడమే అని చెప్పారు. ప్రభుత్వ దుశ్చర్యను, ఈ ప్రజాస్వామిక చర్యను ప్రజాస్వామికులందరూ ఖండించాలన్నారు. ప్రభుత్వ దుశ్చర్యను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
జనసేనానికి ఘన స్వాగతం ..(Conspiracy on Prime 9)
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి మీదుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏలూరుకి చేరుకున్నారు. జనసేన పార్టీ జిల్లా నాయకులు రమేష్ ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు హనుమాన్ జంక్షన్ వద్ద స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ స్వాగత ర్యాలీలో జనసేన కార్యకర్తల బైకుని కారు ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు జనసేన కార్యకర్తలకి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ నలుగురినీ జనసేన నేతలు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.