Site icon Prime9

CM KCR: కరెంట్,నీళ్ల కోసం కాంగ్రెస్ ఏనాడూ పోరాడలేదు.. సీఎం కేసీఆర్

KCR

KCR

CM KCR: సీఎం కేసీఆర్ మంగళవారం హూజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.ప్రజలు మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పార్టీల చరిత్ర, వైఖరిపై చర్చ జరగాలని అన్నారు.

కాంగ్రెస్‎లో డజను మంది సీఎం అభ్యర్థులు..(CM KCR)

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ అనవసరంగా 24గంటల కరెంటు ఇస్తున్నాడని అంటున్నారని రైతులకు మూడు గంటలు ఇస్తే సరిపోతదని అంటున్నారని అన్నారు. సాగునీటి కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ కొట్లాడలేదని చెప్పారు. కాంగ్రెస్‎లో డజను మంది సీఎం అభ్యర్థులు ఉన్నారని వారికి పదవులు, కాంట్రాక్టులే ముఖ్యమని కేసీఆర్ విమర్శించారు. దళిత మేధావులు ఆలోచన చేయాలని తరతరాలుగా దళితజాతి అణచివేతకు గురవుతున్నదని కేసీఆర్ అన్నారు. దళితబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్‌ అని చెప్పారు.ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. ఓటు మన తలరాతను మారుస్తుంది.ఓటును ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయొద్దు.నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టాల్సిన ప్రాంతంలో కట్టలేదు.తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు నోరు మూసుకుని కూర్చుకున్నారని కేసీఆర్ ఆరోపించారు.

తెలంగాణ కోసం పేగులు తెగేదాకా పోరాడాను.కరెంట్, నీళ్ల కోసం కాంగ్రెస్ ఏనాడు పోరాడలేదు.కాంగ్రెస్‌లో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు.అసలు కాంగ్రెస్సే గెలిచే పరిస్థితి లేదు.పదవులు, కాంట్రాక్టులే కాంగ్రెస్ నేతలకు ముఖ్యం.కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కోసం పోరాడారా? రైతుబంధు మంచిదని స్వామినాథన్ ప్రశంసించారు. రైతుబంధు వద్దని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.ధరణి ఉంచాలా? రద్దు చేయాలా?3 గంటల కరెంట్ కావాలా? 24 గంటల కరెంట్ కావాలా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని కేసీఆర్ కోరారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలను పట్టించుకోలేదు | CM KCR Fire Comments On Congress Party | Prime9 News

Exit mobile version
Skip to toolbar