CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర మామిడి పండ్లను ప్రధాని నరేంద్ర మోదీ కి పంపారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోయినా ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపే సంప్రదాయాన్ని మమతా బెనర్జీ చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.
గత ఏడాది సోనియా, కేజ్రీవాల్ కు ..(CM Mamata Banerjee)
అందంగా చుట్టిన గిఫ్ట్ బాక్స్‌లో మమత ఈ మామిడి పండ్లను పంపించారు. హింసాగర్, లాంగ్రా, లక్ష్మణ్ భోగ్ మరియు ఫజ్లీతో సహా వివిధ రకాల మామిడి పండ్లను ప్రధాని నివాసం మరియు ఇతరులకు పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాన మంత్రి కార్యాలయం, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు ఈ మామిడిపండ్లను పంపినట్లు సమాచారం. గత ఏడాది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లకు మమతా బెనర్జీ మామిడి పండ్లను పంపారు. 2011లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రారంభించిన సంప్రదాయాన్ని మమతా బెనర్జీ నసాగిస్తున్నారు.
2019లో దుర్గాపూజ సందర్భంగా మమతా బెనర్జీ తనకు కుర్తాపైజామా, స్వీట్లు పంపారని ప్రధాని మోదీ వెల్లడించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో జరిగిన సంభాషణలో ఆయన ప్రతిపక్ష పార్టీల్లో నాకు చాలా మంది స్నేహితులున్నారు. ఇప్పుడు కూడా మమతా దీదీ వ్యక్తిగతంగా ప్రతి సంవత్సరం నా కోసం ఒకటి లేదా రెండు కుర్తాలను ఎంపిక చేస్తారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారని మోదీ చెప్పారు.