Site icon Prime9

Alekhya Harika : సంతోష్ శోభన్ మూవీలో హీరోయిన్ గా అలేఖ్య హారిక.. మళ్ళీ ఆ కాంబో రిపీట్ !

youtuber Alekhya Harika as heroin in santhosh shobhan movie

youtuber Alekhya Harika as heroin in santhosh shobhan movie

Alekhya Harika : అలేఖ్య హారిక.. అలియాస్ దేత్తడి హారిక అంటే తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య తెలియని వారంటూ ఎవరు ఉండరు. దేత్తడి అంటూ యూట్యూబ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది ఈ అమ్ముడు. యూట్యూబ్ తెలంగాణ స్లాంగ్ తో వీడియోలు చేస్తూ పాపులర్ అయింది అలేఖ్య హారిక. యూట్యూబ్ లో వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు, బిగ్ బాస్ తో మరింత ఫేమస్ అయింది. హారిక బిగ్ బాస్ తర్వాత నుండి తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసిందనే చెప్పుకోవాలి. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక  ప్రస్తుతం యూట్యూబ్ లోనే పలు ప్రైవేట్ ఆల్బమ్స్, సిరీస్ లు చేస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది.

అయితే తాజాగా అలేఖ్య హారిక (Alekhya Harika)  ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా సుమన్ పాతూరి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా తాజాగా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ కొట్టేసింది అలేఖ్య. ఈ మూవీని బేబీ నిర్మాత SKN, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ కలిసి నిర్మిస్తున్నారు. జీఏ2 ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఈరోజు  అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా జరిగింది. అలానే ఫస్ట్ లుక్ ని కూడా లాంచ్ చేశారు.

అయితే ఫస్ట్ లుక్ లోనే హీరో – హీరోయిన్ లిప్ కిస్ ఇస్తున్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. అలాగే ఈ పోస్టర్ మీద ‘కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి’ అని రాసారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. ఇక దేత్తడి హారిక (Alekhya Harika)  హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూనే మొదటి సినిమాలో లిప్ కిస్, రొమాన్స్ చేయబోతున్నట్టు ఈ పోస్టర్ తోనే అర్ధమవుతుంది. ఈ సినిమాకి టైటిల్ ఇంకా ప్రకటించలేదు. చూడాలి మరి బిగ్ స్క్రీన్ పై ఈ అమ్మడు ఏ విధంగా రాణిస్తుందో అని..

 

Exit mobile version