Site icon Prime9

Waltair veerayya Trailer : సోషల్ మీడియాను ఊపేస్తున్న చిరంజీవి “వాల్తేరు వీరయ్య” మానియా..

waltair veerayya trailer tending on social media starring megastar chiranjeevi

waltair veerayya trailer tending on social media starring megastar chiranjeevi

Waltair veerayya Trailer : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అలానే మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. చాలా కాలం తర్వాత మెగాస్టార్ ఫోళ్ల మాస్ రోల్ లో నటిస్తుండడంతో మూవీపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో కూడా చిరంజీవి మాస్ మూల విరాట్ విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు అంటూ మేకర్స్ చెబుతున్నారు.

కాగా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న వస్తున్న ఈ చిత్రం… ప్రమోషన్స్ లో జోరు పెంచింది.

ఈ మేరకు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లోని ఆర్‌కె బీచ్‌లో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 1 కారణంగా అక్కడ ఈవెంట్ నిర్వహించడానికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో చిత్ర బృందం వైజాగ్ లోనే ఆంధ్రా యూనివర్సిటీకి ప్రీ రిలీజ్ వేదికను మార్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక మరోవైపు ఈరోజు సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్..?

ఈ మెగా మాస్ చిత్రం ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6.03 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. అందుకు గాను సోషల్ మీడియా వేదికగా.. మాస్ మూలవిరాట్ వేట మొదలు అంటూ సముద్ర అలల బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి బల్లెం పట్టుకొని ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ తరుణంలో మెగా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాని మెగాస్టార్ పోస్ట్ లతో నింపేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా మొత్తం మెగాస్టార్ మానియాతో ఊగిపోతుంది.

ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టీవీ ఛానల్ జెమెని భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి గత మూడు చిత్రాల శాటిలైట్ రైట్స్‌ను కూడా ఈ ఛానల్ సొంతం చేసుకోవడంతో, ఇప్పుడు వాల్తేరు వీరయ్య శాటిలైట్ రైట్స్ కోసం భారీ రేటును ఆఫర్ చేసిందట. దీంతో చిరు నెక్ట్స్ మూవీని కూడా జెమిని టీవీలోనే బుల్లితెర ప్రేక్షకులు చూడనున్నారు.

ఇవి కూడా చదవండి…

Minister Roja: రోజా నువ్వు పర్యాటక మంత్రివా.. పవన్‌ను తిట్టడానికి మంత్రివా? – జనసేన శివపార్వతి ఆగ్రహం

Waltair Veerayya: “సుమ అడ్డా”లో మెగాస్టార్ చిరంజీవి.. వాల్తేరు వీరయ్య డైరెక్టర్‌తో?

CM Jagan : చిరంజీవి, బాలకృష్ణకు సినిమా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం…

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version