Site icon Prime9

NTR-Team India: జూ. ఎన్టీఆర్‌తో టీమిండియా ప్లేయర్లు.. ఫోటోలు వైరల్

team india

team india

NTR-Team India:న్యూజిలాండ్ తో జరిగే మెుదటి వన్డేకు హైదరాబాద్ వచ్చిన భారత్ ప్లేయర్లు సందడి చేశారు. కాస్త సమయం దొరకడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీమిండియా ప్లేయర్లను కలిశాడు. సోషల్ మీడియాలో దీనికి సంబధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

 

జూనియర్ ఎన్టీఆర్.. టీమిండియా ప్లేయర్లు సరదాగా సందడి చేశారు. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులు.. ఇటు క్రికెట్ అభిమానులు ఈ ఫోటోలను చూసి మురిసిపోతున్నారు. ఈ ఫోటోలను చూస్తూ.. ఎన్టీఆర్ క్రేజ్ ఇది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌‌ను కలిసినవారిలో చాహల్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. వారితో ఎన్టీఆర్ ముచ్చటించారు.

హైదరాబాద్ లో ఖరీదైన కార్‌ కలెక్షన్స్‌తో ప్రసిద్ధి చెందిన నజీర్ ఖాన్‌ నివాసంలో క్రికెటర్లను ఎన్టీఆర్‌ కలిశాడు.

టీమిండియా ఆటగాళ్లలో చాలమంది నజీర్ ఖాన్ స్నేహితులు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు అవార్డు రావడం పట్ల Suryakumar Yadav సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం పట్ల ఎన్టీఆర్ కు సూర్య శభాకాంక్షలు తెలిపాడు.

సూర్య తన సతీమణితో కలిసి ఎన్టీఆర్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు.
ఈ పోస్టుపై ఎన్టీఆర్ స్పందించారు. సూర్య కుమార్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపిన ఎన్టీఆర్.. రేపటి మ్యాచ్ లో అదరగొట్టాలని కామెంట్ చేశాడు.

మరో క్రికెటర్ చాహల్ ట్విట్టర్ వేదికగా.. ఎన్టీఆర్ దిగిన ఫోటోను షేర్ చేశారు.

ఈ సందర్భంగా మాస్ మనిషిని కలవడం ఆనందంగా ఉందని చెబుతూ ఎన్టీఆర్ ని ట్యాగ్ చేశారు.

ఆర్ఆర్ఆర్ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం సంతోషంగా ఉందని చాహల్ అన్నారు. ఈ అవార్డు దక్కినందుకు గర్వంగా ఉందని చాహల్ ట్వీట్ చేశాడు.

దీంతో క్రికెట్ అభిమానులు.. తారక్ అభిమానులు వీటిని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

ఇక రేపటి మ్యాచ్ కి హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version