Site icon Prime9

Siima Awards 2023 : సైమా అవార్డ్స్‌ 2023 తెలుగు ఫుల్ లిస్ట్.. ఏ కేటగిరిలో ఎవరికి అవార్డు వచ్చిందంటే?

siima awards 2023 for telugu films full list

siima awards 2023 for telugu films full list

Siima Awards 2023 : సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2023 వేడుకలు దుబాయ్ లో ఘనంగా స్టార్ట్ అయ్యాయి. ఈ మేరకు సెప్టెంబర్ 15న తెలుగు, కన్నడ పరిశ్రమల అవార్డుల వేడుక జరగగా.. నేడు తమిళ్, మలయాళం సినిమాలకు సంబంధించిన వేడుక జరగనుంది. కాగా నిన్న జరిగిన ఈవెంట్లో పలువురు ప్రముఖులు పాల్గొని అలరించారు. తెలుగులో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్, ఉత్తమ నటిగా శ్రీలీల అవార్డులు గెలుచుకున్నారు. అయితే ఉత్తమ నటుడు విభాగంలో  అడివి శేష్- మేజర్, దుల్కర్ సల్మాన్ – సీతారామం, నిఖిల్ – కార్తికేయ 2 , సిద్ధూ జొన్నలగడ్డ – డీజే టిల్లు, రామ్ చరణ్ – ఆర్ఆర్ఆర్ చిత్రాల నుంచి పోటీ పడగా.. ఎన్టీఆర్ కి అవార్డు దక్కింది.

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లోని నాటు నాటు పాటకు ఆస్కార్, గోల్డెన్ గ్లొబ్ అవార్డులతో పాటు మరెన్నో ఇంటర్నేషనల్ అవార్డులు పొందింది. అలానే ఈ వేడుకలో కూడా ఈ మూవీ సత్తా చాటింది. ఈ చిత్రం మొత్తం 11 కేటగిరీల్లో నామినేట్ అవ్వగా ఏకంగా 5 అవార్డులు గెలుచుకొని టాప్ లో ఉంది. ఉత్తమ నటుడు – ఎన్టీఆర్, ఉత్తమ దర్శకుడు – రాజమౌళి, ఉత్తమ సంగీత దర్శకుడు – ఎంఎం కీరవాణి, ఉత్తమ సినిమాటోగ్రఫీ – కేకే సెంథిల్ కుమార్, ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్ (నాటు నాటు సాంగ్) లకు గాను అవార్డులు వచ్చాయి.

సైమా అవార్డ్స్‌ 2023 తెలుగు లిస్ట్ (Siima Awards 2023)_..

ఉత్తమ నటుడు – ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ నటి – శ్రీలీల (ధమాకా)

ఉత్తమ దర్శకుడు – రాజమౌళి (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ చిత్రం – సీతారామం

ఉత్తమ సహాయ నటుడు – రానా(భీమ్లా నాయక్)

ఉత్తమ సహాయ నటి – సంగీత (మసూద)

ఉత్తమ విలన్ – సుహాస్ (హిట్2)

ఉత్తమ కమెడియన్ – శ్రీనివాసరెడ్డి (కార్తీకేయ 2)

ఉత్తమ సంగీత దర్శకుడు – కీరవాణి (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ – సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్ (నాటు నాటు సాంగ్)

ఉత్తమ గాయకుడు – రామ్ మిర్యాల (డీజే టిల్లు)

ఉత్తమ గాయకురాలు – మంగ్లీ (జింతాక సాంగ్, ధమాకా)

ప్రామిసింగ్ నూతన నటుడు – బెల్లంకొండ గణేష్

ఉత్తమ నూతన నటి – మృణాల్ ఠాకూర్ (సీతారామం)

ఉత్తమ నూతన దర్శకుడు – వశిష్ట మల్లిడి (బింబిసార)

ఉత్తమ నూతన నిర్మాత – శరత్, అనురాగ్ (మేజర్)

ఉత్తమ నటుడు క్రిటిక్స్ – అడివి శేష్ (మేజర్)

ఉత్తమ నటి క్రిటిక్స్ – మృణాల్ ఠాకూర్ (సీతారామం)

సెన్షేషన్ అఫ్ ది ఇయర్ – కార్తికేయ 2

ఫ్యాషన్ యూత్ ఐకాన్ – శృతి హాసన్

 

Exit mobile version