Site icon Prime9

Viral News : విచిత్ర ఘటన… దగ్గితేనే విరిగిపోయిన పక్కటెముకలు

shocking-incident-happened-in-china-and-goes-viral

shocking-incident-happened-in-china-and-goes-viral

Viral News : దగ్గు, జలుబు అనే సాధారణంగా అందరికీ వచ్చేవే. ముఖ్యంగా ఈ చలి కాలంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు దగ్గు, జలుబు వస్తూనే ఉంటాయి. అయితే దగ్గడం వల్ల పక్కటెముకలు విరిగిన ఘటన తాజాగా సంభవించింది. ఈ ఆశ్చర్యమైన ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురవుతున్నారు. అయితే ఈ వింత ఘటన జరిగింది మన దేశంలో కాదు చైనాలో. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ సంఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం…

చైనా లోని షాంఘై నగరానికి చెందిన హువాంగ్ అనే మహిళ ఇటీవల కొంచెం ఘాటైన ఆహారాన్ని తిన్నది. కాగా అకస్మాత్తుగా విపరీతంగా దగ్గు వచ్చింది. కానీ ఆ తర్వాత ఛాతీ దగ్గర నొప్పి వచ్చినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాత ఛాతీలో తీవ్రంగా నొప్పిగా ఉండడంతో వైద్యులను సంప్రదించింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఛాతీలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. అయితే దగ్గితేనే ఆమె ఛాతీ లోని పక్కటెముకలు ఎందుకు విరిగిపోయాయన్న ప్రశ్న ఆమె కుటుంబ సభ్యుల్లో తలెత్తింది.

అందుకు గాను వైద్యులు ఇచ్చిన సమాధానం ఏంటంటే… ఆమె ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉండడం వల్ల శరీరంలో ఎముకలకు ఆధారంగా ఉండే కండరం ఎదగలేదని చెప్పారు. దీంతో ఆమె దగ్గినప్పుడు అవి విరిగిపోయాయని వివరించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, కోలుకున్న తర్వాత వ్యాయాయం, సరైన భోజనం తీసుకోవడం ద్వారా కండరాన్ని పెంచుకోవచ్చని అన్నారు. ఆమె 171 సెంటీమీటర్ల పొడవు ఉండగా… కేవలం 57 కిలోల మాత్రమే బరువు ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది.

Exit mobile version