Shahrukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, షారూఖ్ కి జంటగా నటించింది.
సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మించారు.
అదే విధంగా ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు.
ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జనవరి 25న విడుదల కానుంది. సినిమా రిలీజ్‌కు ఇంకా మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది.
ఇటీవల కాలంలో ఏ మూవీకి లేనన్ని వివాదాలు ఈ సినిమాని చుట్టుముట్టాయి అనడంలో సంగదేహం లేదు.
కాగా ఈ సినిమాలోని బేషరమ్ సాంగ్ వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే.
ఈ సాంగ్ లో బికినిలో అందాల ఆరబోతతో రెచ్చిపోయింది దీపికా. దాంతో పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
అలాగే దీపికా కాషాయం రంగు బికినీ ధరించడంతో బీజీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మూవీని బాయ్ కాట్ చేయాలంటూ ప్రచారం జరిగింది.
జనవరి 25న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
పాన్ ఇండియా లెవెల్లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
ప్రస్తుతం పఠాన్ ప్రమోషనల్ కార్యక్రమాలతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
ఇంతకీ షారూఖ్ ఖాన్ (Shahrukh Khan) ఏమన్నారంటే..?
ఈ క్రమంలో సోషల్ మీడియాలో #AskSRK అంటూ అభిమానులతో ముచ్చటించాడు షారుక్.
పఠాన్ సినిమా అడ్వాన్స్ టికెట్లు, ఏకంగా థియేటరే బుక్ చేసుకున్నవారికి కృతజ్ఞతలు అని షారూఖ్ తెలిపాడు.
ఈ సందర్భంగా ఓ అభిమాని.. సినిమా విడుదలైన రోజు మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా థియేటర్‌కు వస్తారా? అని అడిగాడు.
ఇందుకు షారూఖ్ ఖాన్ రిప్లయ్ ఇస్తూ.. రామ్‌చరణ్ తీసుకెళ్తే తప్పకుండా వస్తా అని బదులిచ్చాడు.
మరి షారుక్ ఖాన్ చేసిన కామెంట్ కి చరణ్ ఏ విధంగా స్పందిస్తాడో ? అని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు.
అంతకు ముందు జనవరి 10న పఠాన్ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను రామ్ చరణ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిలీజ్ చేశాడు.
ఆ సందర్భంలో షారూఖ్.. చరణ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆస్కార్ ని తీసుకువస్తే నన్ను ఒకసారి తాకనివ్వండి అంటూ ట్వీట్ చేశారు. అందుకు చెర్రీ రిప్లయ్ కూడా ఇచ్చారు.
మళ్ళీ ఇప్పుడు షారూఖ్ చెర్రీ గురించి ప్రస్తావించడం పట్ల అందరూ ఫిదా అవుతున్నారు.
Yeah if Ram Charan takes me!! https://t.co/LoaE4POU79
— Shah Rukh Khan (@iamsrk) January 21, 2023
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/