Scrap Policy : కారు కొంటే రూ.లక్ష డిస్కౌంట్.. ఇలా చేస్తే మీకూ వస్తుంది

కొత్తగా కార్ కొనబోతున్నారా.. ఏ వాహనం మీదైనా లక్ష రూపాయలు డిస్కైంట్ పొందవచ్చు.. అది ఎలా అనుకుంటున్నారా.. ఇటీవల కాలంలో పీఎం మోదీ వాహన స్క్రాపేజ్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ పాలసీ కింద పాత వెహికిల్ ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయి. మరి ఈ కొత్త పాలసీ యొక్క ముఖ్య ఫీచర్లు ఏంటో చూసేద్దాం.

  • Written By:
  • Updated On - February 2, 2023 / 11:49 AM IST

Scrap Policy : కొత్తగా కార్ కొనబోతున్నారా.. ఏ వాహనం మీదైనా లక్ష రూపాయలు డిస్కైంట్ పొందవచ్చు.. అది ఎలా అనుకుంటున్నారా..

ఇటీవల కాలంలో పీఎం మోదీ వాహన స్క్రాపేజ్ విధానాన్ని తీసుకువచ్చారు.

ఈ పాలసీ కింద పాత వెహికిల్ ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయి.

మరి ఈ కొత్త పాలసీ యొక్క ముఖ్య ఫీచర్లు ఏంటో చూసేద్దాం.

పీఎం మోదీ వాహన స్క్రాపేజ్ పాలసీ విధానం ద్వారా 15 ఏళ్లు పైబడిన వాహనాలను తుక్కుగా మార్చేస్తారు.

మన దగ్గర ఉన్న పాత వాహనాలను సర్టిఫైడ్ స్క్రాప్ డీలర్ వద్దకు తీసుకువెళ్లడం ద్వారా ఆ డీలర్ వాహనాన్ని బట్టి తుక్కుకు 4 నుంచి 5 శాతం డబ్బును చెల్లిస్తారు.

మీ వాహనానికి స్క్రాప్ సర్టిఫికేట్ కూడా అందిస్తారు.

తద్వారా మీరు ఏదైనా కారును కొనడానికి షోరూమ్ వెళ్లినప్పుడు ఈ స్క్రాప్ సర్టిఫికేట్ను చూపించడం వల్ల మీకు రిజిస్ట్రేషన్ ఫీ ఉండవు.

అలాగే మీరు కొనే కొత్త వాహనంపై మీరు అదనంగా 4 నుంచి 5 శాతం డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.

అంతే కాకుండా వ్యక్తిగత వాహనాలకు 25 శాతం, వాణిజ్య వాహనాలకు 15 శాతం వరకు రోడ్డుపన్ను రాయితీ కూడా పొందవచ్చు.

ఈ పాలసీ ఏప్రిల్ 1 2023 నుంచి అమలులోకి రానుంది.

(Scrap Policy) ఆటోమోటివ్ స్క్రాపేజ్ ని ప్రారంభించిన ప్రధాని మోదీ..

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) గత ఏడాది ప్రారంభంలో 15 ఏళ్లకుపైబడిన వాహనాల RC యొక్క పునరుద్ధరణ రుసుములను పెంచాలని ప్రతిపాదిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను కూడా ప్రవేశపెట్టింది.

మరి అసలు ఈ పాలసీని తీసుకురావడం వెనుక మెయిన్ రీజన్స్ ఏంటంటే వాతావరణంలో పెరుగుతున్న వాయు కాలుష్యం.

ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడానికిగానూ కేంద్ర ప్రభుత్వం ఈ తుక్కు పాలసీని తీసుకువచ్చింది.

2021 ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆటోమోటివ్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించారు.

దీన్నే ‘వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్’ అని కూడా పిలుస్తారు.

అయితే ప్రజల నుంచి దీనికి ఊహించిన స్పందన రాలేదు. దీనితో అధికారులే నేరుగా రంగంలోకి దిగారు.

పాతవాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు గానూ నోయిడా ప్రభుత్వం నేటి నుంచి 15 ఏళ్లకుపైబడి ఉపయోగిస్తున్న వాహనాలను తుక్కుగా మార్చేయనుంది.

అలాంటి వెహికిల్స్ కు గత అక్టోబర్ నుంచే 15ఏళ్లకు పైబడిన పెట్రోల్ 10ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేసింది.

అలా క్యాన్సిల్ అయిన వాహనాల్లో ప్రభుత్వ రంగాలకు చెందిన వాహనాలు కూడా ఉన్నాయి.

 

 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వాటి ఆధ్వర్యంలో నడిచే రవాణా, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉన్న దాదాపు తొమ్మిది లక్షలకు పైగా కార్లు, ట్రక్కులు, అంబులెన్సులు వంటి వాహనాలు తుక్కుకు వెళ్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

ఇకపై అలాంటి వాహనాలు రోడ్లపై తిరగబోవని ఆయన పేర్కొన్నారు.

వాటి స్నానంలో ప్రత్యామ్నాయ వాహనాలైన ఇథనాల్, మిథనాల్, బయో సీఎన్జీ ఈఎన్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రభుత్వం ప్రోత్సహించనుంది.

పాతబడిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు జిల్లాకు రెండు, మూడు చొప్పున స్క్రాపింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

సైన్యం, శాంతి భద్రత, అంతర్గత భద్రతలకు ఉపయోగించే వాహనాలకు ఈ పాలసీ నుంచి కేంద్రం మినహాయింపునిచ్చింది.