Site icon Prime9

Rgv comments: పవన్ పై అభిమానంతోనే ట్వీట్స్ చేస్తుంటా- ఆర్జీవీ

rgv

rgv

Rgv comments: పవన్ కళ్యాణ్.. జనసైన పై ఆర్జీవీ Ram Gopal Varmaవరుస ట్వీట్లు చేస్తు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు, పవన్ భేటి అయినప్పటి నుంచి ఆర్జీవీ వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు.
ఓ వైపు పవన్ కళ్యాణ్ అభిమానిగా ట్వీట్స్ చేస్తున్నా అంటూనే.. పవన్ పై సెటైర్లు వేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.

ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమావేశంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. వైసీపీకి తోడుగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ చేసిన ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్ల పై జనసేన, టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ కు అనుకూలంగా ఉండే ఆర్జీవీ.. తనదైన శైలిలో విమర్శిలు చేస్తున్నారు. కేవలం డబ్బు కోసమే కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. వర్మ ట్వీట్ సినీ వర్గాల్లో.. మరో పక్క రాజకీయల్లో కలకలం రేపింది.

తాజాగా మరో ట్వీట్ చేసిన ఆర్జీవీ నాగబాబూపై కామెంట్ చేశారు.

కొణిదేల నాగబాబు.. పవన్ కి అన్నయ్య, చిరంజీవి తమ్ముడు అవ్వచ్చు గాని తనకు ఏం కాడని ఆర్జీవీ అన్నాడు.

తనతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు.

ఇప్పటికి పవన్ పై అభిమానంతోనే ట్వీట్ చేస్తున్నానని.. అది పవన్ అభిమానులు అర్ధం చేసుకోడవం లేదని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

తనకు పవన్ పై జనసేన పై ఎలాంటి కోపం లేదని.. పవన్
అభిమానిగా మాత్రమే తన అభిప్రాయాలను చెబుతున్నట్లు ఆర్జీవీ తెలిపారు.

ఇక వచ్చే ఎన్నికల్లో నాగబాబుని సలహదారుడిగా పెట్టుకుంటే మంచిదా కాదని ఆర్జీవీ అన్నారు.

జనసేన పార్టీకి మంచి పరిస్థితులు ఉండవని.. దీనిపై పనవ్ కళ్యాణ్ మరోసారి ఆలోచించాలని సూచించారు. నాగబాబుకు సలహాదారుడి పోస్ట్ వద్దని ఆర్జీవీ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

ఇక ఆర్జీవీ చేసిన ట్వీట్ పై జనసేన నేతలు కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. రాజకీయాల గురించి నీకెందుకు అంటూ ఆర్జీవీని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు.

అలాగే ఏపీ రాజకీయాల గురించి మాట్లడేందుకు ఓటు హక్కు ఉందా అని జన సేన కార్యకర్తలు ఆర్జీవీకి ట్వీట్స్ చేస్తున్నారు.

జనసేన నాయకులకు ధైర్యం ఉందని.. అందుకే నాగబాబు ధైర్యంగా ఆర్జీవీపై కామెంట్ చేశారని కార్యకర్తలు అంటున్నారు. అభిమాని అనే ముసుగులో మాట్లడటం సరికాదని సూచించారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version