Site icon Prime9

Unstoppable : ప్రభాస్ దెబ్బకి రికార్డులు మోత మొగిస్తున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్…

prabhas episode in balakrishna unstoppable show creating records

prabhas episode in balakrishna unstoppable show creating records

Unstoppable : నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా “అన్ స్టాపబుల్” షో చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసిన బాలకృష్ణ… ఇప్పుడు అదే ఊపులో సెకండ్ సీజన్ ని కూడా దుమ్ములేపుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఇప్పుడు ఈ షో లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నట్లు ప్రకటించి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో ప్రభాస్ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని ఆయన అభిమనులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపధ్యం లోనే డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ముందుగానే ఈ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ చేశారు. రెండు పార్ట్ లుగా ఈ ఎపిసోడ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ఆహా సంస్థ ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాత్రి పార్ట్ 1 ను రిలీజ్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. దీంతో డార్లింగ్ ఎపిసోడ్ ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యింది. వీలైనంత త్వరగా యాప్‌ను తిరిగి వర్క్ అయ్యేలా చేస్తున్నట్లు ఆహా పేర్కొంది. అయితే ఆహా యాప్ క్రాష్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇది తిరిగి ఎప్పుడు వర్క్ అవుతుందా అని ఆసక్తిగా చూశారు. రెండో పార్ట్‌ను జనవరి 6న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఆహా పేర్కొంది. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో బాలయ్య – ప్రభాస్ – రామ్ చరణ్ మధ్య సంభాషణ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచింది.

అన్ స్టాపబుల్ లో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ పాల్గొన్న తొలి ఎపిసోడ్ కేవలం 4 రోజుల్లో 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించింది. ఒక తెలుగు టాక్ షో‌లో ఒక ఎపిసోడ్‌కు ఇదొక రికార్డు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ ఎపిసోడ్ 12 గంటల్లోనే 50 మిలియన్ మినిట్స్ ను రికార్డు చేసింది. ఇండియాలో పలు భాషల్లో ఇప్పటికే ‘కాఫీ విత్ కరణ్’, ‘ది అనుపమ్ ఖేర్ షో’, ‘ది కపిల్ శర్మ షో’, రానా ‘నంబర్ వన్ యారి’ వంటి టాక్ షోలు వచ్చాయి. కానీ, వీటన్నింటినీ ‘అన్‌స్టాపబుల్’ దాటేసింది. ఈ మేరకు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఊపు చూస్తుంటే మరిన్ని రికార్డులను తిరగరాయడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

Exit mobile version