Site icon Prime9

Unstoppable 2 : బాలకృష్ణ అన్ స్టాపబుల్‌లో డార్లింగ్ నోట ఆ మాట… ఫుల్ ఖుషి అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

prabhas comments in balakrishna unstoppable show goes viral

prabhas comments in balakrishna unstoppable show goes viral

Unstoppable 2 : బాలకృష్ణ ’అన్ స్టాపబుల్‘ షో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన మొదటి పార్ట్ ’ఆహా‘ లో స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ పార్ట్ ను శుక్రవారం అర్థరాత్రి నుంచి ఆహాలో అందుబాటులో ఉంచారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు హీరో గోపిచంద్ కూడా పాల్గొన్నారు. ప్రభాస్ – గోపీచంద్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడంతో షో ఫన్ గా సాగింది. అంతేకాకుండా బాలయ్య తనదైన స్టైల్ లో.. తికమక పెట్టె ప్రశ్నలతో ఇద్దరిని ఒక ఆట ఆడుకున్నారు.

ఇక ఈ ఎపిసోడ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ లోని ఫన్ యాంగిల్ ను చూపించినందుకు బాలయ్యకు థ్యాంక్స్ చెబుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అంతేకాకుండా షోలో ప్రభాస్ చెప్పిన ’జై బాలయ్య‘ డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ డైలాగ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. ’ మాతోనే కాదు.. ప్రభాస్ తో కూడా జై బాలయ్య అనిపించావ్. డార్లింగ్ లోని మరో యాంగిల్ ను చూపించినందుకు థ్యాంక్స్ బాలయ్య‘ అంటూ ప్రభాస్ జై బాలయ్య అంటున్న క్లిప్ ను తెగ షేర్ చేస్తున్నారు. షో ఫన్ గా సాగింది.

ఈ ఎపిసోడ్ లో కూడా బాలయ్య గోపి చంద్ ని ప్రభాస్ పెళ్లి గురించి అడిగితే వచ్చే సంవత్సరం ఉంటుంది అని చెప్పాడు గోపి చంద్. ఇక ఇటీవల ప్రభాస్ పెదనాన్న, హీరో కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఎపిసోడ్ లో ఆయన గురించి కూడా మాట్లాడారు. ప్రభాస్ ని గతంలో కృష్ణంరాజు పొగిడిన వీడియోలు చూపించారు. అనంతరం కృష్ణంరాజుకి నివాళులు అర్పిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. అభిమానులు జోహార్ రెబల్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. అలాగే కృష్ణంరాజు, ప్రభాస్ ని కలిపి వారి సినిమాల్లోంచి ఒకేలా ఉన్న విజువల్స్ ని తీసి అభిమానులు ఓ వీడియో చేయగా దాన్ని ప్లే చేశారు. ఇక ప్రభాస్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

Exit mobile version