Pawan Kalyan-Chaturmasa Deeksha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షను చేపట్టారు. వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో ముగిసింది.ప్రదోష కాలాన వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
అనంతరం ఏకహారతి, ద్విహారతి, చతుర్ద, పంచ, నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరగా కుంభ హారతితో వారాహి ఏకాదశ దిన ఆరాధన పూర్తయింది. వేద పండితులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ, వేణుగోపాల శర్మ, హరనాథ్ శర్మ పూజా క్రతువును పూర్తి చేసి, పవన్ కు ఆశీర్వచనాలు అందజేశారు.ఇలాఉండగా పవన్ కళ్యాణ్ త్వరలోనే చాతుర్మాస దీక్ష చేయనున్నారు. గృహస్తాచార రీతిలో ఈ దీక్షను చేపడుతున్నారు. అధికార విధులను నిర్వర్తిస్తూనే శుభ తిధుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరిస్తారు. దీక్షా కాలంలో పరిమితంగా సాత్వికాహారం మాత్రమే స్వీకరిస్తారు.