Site icon Prime9

Extra Ordinary Man : నితిన్, శ్రీలీల “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” ట్రైలర్ రిలీజ్.. ఫన్ ఫుల్ రైడ్ గ్యారంటీ ???

nithin and sree leela starring Extra Ordinary Man movie trailer released

nithin and sree leela starring Extra Ordinary Man movie trailer released

Extra Ordinary Man : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీలో నితిన్ సినిమాల్లో నటించే జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 8న రిలీజ్ కాబోతుంది.

ఇటీవల (Extra Ordinary Man) టీజర్ తో మూవీ ఎలా ఉండబోతుందో సాంపిల్ చూపించిన మేకర్స్.. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. తాజాగా మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే మూవీ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని అర్ధమవుతుంది. బాలయ్య ఫ్యాన్స్ ని కొడతారంటగా అని ప్రశ్నించడం, పొన్నియిన్ సెల్వన్ కావ్యంగా ఉంది అర్ధం కాలేదు అనడం.. ఇలా సినిమా వ్యక్తులు, సినిమా గురించి మాట్లాడుతూ ఆడియన్స్ ని నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ మూవీలో రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ ఎండ్ లో రాజశేఖర్.. నాకు జీవితం, జీవిత రెండు ఒకటేలే అని చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

‘నా పేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న వక్కంతం వంశీ లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. రైటర్ గా చాలా హిట్లు అందుకున్న వక్కంతం వంశీ దర్శకుడిగా మొదటి సినిమాతో అపజయం అందుకున్నారు. మరోవైపు 2020లో ‘భీష్మ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని సాధించలేకపోయాడు. ‘భీష్మ’ తర్వాత వచ్చిన ‘రంగ్ దే’ యావరేజ్ గా నిలవగా, గత ఏడాది విడుదలైన ‘మాచర్ల నియోజకవర్గం’ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న వీరిద్దరూ ఈసారైనా హిట్ కొడతారేమో చూడాలి.

Exit mobile version