Site icon Prime9

Nayanatara : పేదలకు న్యూ ఇయర్ గిఫ్ట్స్ ఇచ్చిన నయనతార – విఘ్నేశ్ శివన్

nayanatara-vignesh shivan gifts to people for new year

nayanatara-vignesh shivan gifts to people for new year

Nayanatara : తెలుగు సినీ ప్రియులకు అందాల భామ నయనతార గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆపై పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసింది. ఇక కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తున్న ఈ భామ… కోలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయింది. తనదైన శైలిలో రాణిస్తూ లేడి సూపర్ స్టార్ హోదాని సంపాదించుకుంది.

కాగా గత ఏడేళ్ల ప్రేమ బంధాన్ని ఏడడుగుల బంధంగా మార్చుకుంటూ జూన్‌లో పెళ్లి పీటలెక్కారు నయనతార- విఘ్నేశ్‌ శివన్‌. అతిరథ మహారథుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవలే కవలలకు తల్లిదండ్రులైన నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు, యాచకులకు కొన్ని బహుమతులు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ లను నయనతార తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

పెళ్ళికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ వీరిద్దరూ కలసి బహిరంగంగా అంతగా కనిపించిన సందర్భాలు తక్కువే అని చెప్పాలి. కానీ కొత్త సంవత్సరం సందర్భంగా పేదలకు ఎంతో కొంత సాయం చేయాలని ఈ విధంగా చేసినట్లు భావిస్తున్నారు. పేపర్ బ్యాగులో కొన్ని గిఫ్ట్స్ ఉంచి వాటిని రహదారులపై కనిపించిన అభాగ్యులకు అందించారు. చెన్నైలోని పలు రహదారుల్లో తిరుగుతూ వీటిని పంచారు. తన కోడలు నయన్ మనసు ఎంతో మంచిదని గతంలో విఘ్నేశ్ తల్లి చెప్పడం తెలిసిందే. ఇంటి పని మనిషి కష్టంలో ఉందని తెలిసి రూ.5 లక్షల సాయం చేసినట్టు చెప్పారు. ఇప్పుడు ఈ వీడియోతో ఆమె అభిమనులంతా మంచి మనస్సు చాటుకుందంటూ పోస్ట్ లు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Exit mobile version