Site icon Prime9

Minister Ktr: అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాం- కేటీఆర్

minister ktr interesting comments about kcr national politics

minister ktr interesting comments about kcr national politics

Minister Ktr : కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతున్నప్పుడు కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు. అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాము అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. ప్రముఖ డైరెక్టర్ దశరధ్ గురించి అందరికీ తెలిసిందే. కింగ్ నాగార్జున నటించిన సంతోషం సినిమాతో డైరెక్టర్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అ ఆతర్వాత సంబరం, మిస్టర్ పర్ఫెక్ట్ , శౌర్య అనే సినిమాలను తెరకెక్కించారు. తాజాగా “కథా రచన” అనే పుస్తకాన్ని రాశారు దశరధ్. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

దశరథ్ రాసిన కథా రచన పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ భాష సాంసృతిక శాఖ తరపున ప్రచురించింది. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ తో పాటు దర్శకులు వివి వినాయక్, నాగ అశ్విన్, హరీష్ శంకర్, కాశీ విశ్వనాథ్, వి ఎన్ ఆదిత్య.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ … నాకు సినిమాతో పాటు క్రియేటివ్ కంటెంట్ అంటే ఇష్టం. అమెరికాలో మాక్ డేమిన్ వాళ్ళు రాసిన స్క్రీన్ ప్లే బుక్ గతంలో చదివాను. అలాంటి పుస్తకాలు తెర వెనుక ఉన్న టెక్నీషియన్స్ కు ఎంతో ఉపయోగ పడతాయి. ఈ పుస్తకం రాసిన దశరథ్ కి నా అభినందనలు. ఒక వ్యూవర్ గా కొన్ని సినిమాలు చూసినప్పుడు అమేజింగ్ గా ఉంటాయి.

 

 

ప్రేక్షకుడికి హత్తుకొని పోయేలా సినిమా తీయాలి. మన సినీ పరిశ్రమని సౌత్ హబ్ గా తీర్చిదిద్దాలనేదే మా ప్రయత్నం అన్నారు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ ఆయన మాట్లాడితే ప్రజలు వింటారు. ప్రజలకు అర్ధం అయ్యేలా డిటైల్ గా చెపుతారు. దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా ఆడుతున్నప్పుడు కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు. అందుకే మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాము అంటూ చెప్పారు. సినిమాని, రాజకీయాలని కలిపి ఆసక్తికరంగా కేటీఆర్ చెప్పడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.

ఇవి కూడా చదవండి…

Ram Gopal Varma: కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Director Bobby: నువ్వు రాజకీయాలకు పనికిరావు అన్నయ్య.. పాలిటిక్స్ కు తమ్ముడు ఉన్నాడు.. డైరెక్టర్ బాబీ కామెంట్స్

Shahrukh Khan : డిల్లీ అంజలి ఘటనపై స్పందించిన షారూఖ్ ఖాన్.. కుటుంబానికి అండగా ఉంటానంటూ

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version