Site icon Prime9

Mental BalaKrishna : #MentalBalaKrishna హ్యాష్‌ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అవుతోంది?

mental balakrishna hash tag trending on social media

mental balakrishna hash tag trending on social media

Mental BalaKrishna : నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది.

గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.

బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఈ మూవీ ఘన విజయం సాధించడంతో ఆదివారం రోజు విజయోత్సవ వేడుక నిర్వహించారు.

అయితే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ సందర్భంగా బాలకృష్ణ ఇప్పుడు విమర్శపాలవుతున్నారు.

ఈ వేడుకలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.. ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ మాట్లాడుకునే వాళ్ళం అని తెలిపాడు. వేద శాస్త్రాలు, నాన్నగారి డైలాగులు,, ఆ రంగారావు .. అక్కినేని తొక్కినేని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అని అన్నారు.

ఇక్కడ బాలయ్య అక్కినేని తొక్కినేని అని అనడంతో అక్కినేని అభిమానులు తీవ్రంగా తప్పు బడుతున్నారు.

దీంతో బాలయ్యపై సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత కూడా వచ్చింది.

ఉద్దేశపూర్వకంగా అన్నారో లేక కావాలని అన్నారో అన్న విషయం పక్కన పెడితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్లతో హర్ట్ అయ్యారు.

తాజాగా బాలయ్యకు హీరోలు నాగ చైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

అక్కినేని వారసులైన యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ ట్విట్టర్ వేదికగా ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఆ ప్రెస్ నోట్ లో .. ఎన్టీఆర్ గారు, రంగారావుగారు, నాగేశ్వరరావు గారు తెలుగు కళామ్మ తల్లి ముద్దు బిడ్డలు వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమే అంటూ వారు రాసుకొచ్చారు.

#ANRLIVESON అంటూ ఆ పోస్ట్ లకి ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

 

 

ట్రెండింగ్ గా #Mental BalaKrishna హ్యాష్ ట్యాగ్..

ఈ విషయంపై అక్కినేని అభిమానులంతా ట్విట్టర్ వేదికగా బాలయ్యపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

ఈ మేరకు #MentalBalakrishna అనే హ్యాష్ ట్యాగ్ ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు.

మరోవైపు బాలకృష్ణ బేషరతుగా అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

లేకుంటే వివిధ రకాల్లో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడమేనా అని వివమర్శిస్తున్నారు.

ఎప్పుడూ నాన్న గారు అప్పట్లో అది చేశారు, ఇది చేశారు అని వారి గురించి చెప్పుకోవడమే కాకుండా.. మనకంటూ సొంతగా సాధించాలని ట్రోల్ చేస్తున్నారు.

నోటికి ఎంతోస్తే అంత వాగడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.

ఒక నెటిజన్ అయితే ఏకంగా అదంతా మాన్షన్ హౌస్ మాయ అని కామెంట్ చేశాడు.

తెలుగు సినీ పరిశ్రమ కోసం అందరూ కష్టపడిన వారే అని .. ఎవర్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఒక సీనియర్ హీరోగా పెద్దరికం అనిపించుకోదని పోస్ట్ లు పెడుతున్నారు.

ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో బర్నింగ్ ఇష్యూలా మారింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version