Site icon Prime9

Megastar Chiranjeevi : డియర్ బన్నీ అంటూ అల్లు అర్జున్ కోసం చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..

mega star chiranjeevi tweet about allu arjun goes viral

mega star chiranjeevi tweet about allu arjun goes viral

Megastar Chiranjeevi : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు బన్నీ. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. 2003లో కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో అల్లు అర్జున్ కు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత ఆర్య, బన్ని, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య 2 ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు. వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇక అల్లు అర్జున్ స్టైల్ కి, డాన్స్ కి ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. తన స్టైల్ తో కుర్ర కారును ఆకట్టుకొని స్టైలిష్ స్టార్ గా పేరుపొందాడు అల్లు అర్జున్. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా మంగళవారం (మార్చి 28)తో బన్నీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఐకాన్‌ స్టార్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తన మేనల్లుడికి విషెస్‌ చెప్పారు. బన్నీ మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

ఆ ట్వీట్ లో (Megastar Chiranjeevi) ..

”డియర్ బన్నీ నువ్వు 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నీ చిన్నతనంలోని జ్ఞాపకాలు నా మదిలో ఇంకా అలానే ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు నువ్వు స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా, పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం వరకు.. మొత్తం నీ ఎదుగుదలని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రానున్న కాలంలో నువ్వు మరింత ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ అల్లు అర్జున్ తో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక చిరంజీవి ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందించారు. ‘మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. నా మనసులో మీ మీద కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుంది. థాంక్యూ చికబాబి’ అని బన్నీ రిప్లై ఇచ్చారు. ఇప్పుడే కాదు గతంలోనూ చిరంజీవిని చికబాబి అని సంబోధిస్తూ ట్వీట్లు చేశారు. ఈ వరుస ట్వీట్లతో మెగా అభిమనులంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు.

 

Exit mobile version
Skip to toolbar