Site icon Prime9

Miss Shetty MR Polishetty : “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కి ఫస్ట్ ప్రేక్షకుడిని నేనే .. ఎంతగానో ఎంజాయ్ చేశా – మెగాస్టార్ చిరంజీవి

megastar chiranjeevi responce over Miss Shetty MR Polishetty movie

megastar chiranjeevi responce over Miss Shetty MR Polishetty movie

Miss Shetty MR Polishetty : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. అలానే ఈ చిత్రంలో అభినవ్ గోమఠం, మురళీ శర్మ, తులసి తదితరులు ముఖ్య పత్రాలు పోషించారు. నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు.

అయితే యూవీ క్రియేషన్స్ సంస్థలో ‘మిర్చి’, ‘భాగమతి’, తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఆ చిత్రాలు భారీ విజయాలు సాధించగా.. ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం.. నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 7 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  అయితే తాజాగా ఈ చిత్రాన్ని (Miss Shetty MR Polishetty) మెగాస్టార్ చిరంజీవి వీక్షించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మూవీ గురించి ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఆ ట్వీట్ లో.. ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేష్ బాబుని అభినందించాల్సిందే.

BTW ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Exit mobile version