Site icon Prime9

Vishakhapatnam: విశాఖ నగరంలో లవర్స్ ఓవరాక్షన్.. వైరల్ అవుతున్న వీడియో.. పోలీసులు ఏం చేశారంటే..?

lovers-hull-chal-in-visakhapatnam

lovers-hull-chal-in-visakhapatnam

Vishakhapatnam: ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తోంది అంటారు లవర్స్. చుట్టూ ఏం జరిగినా తమేకేం పట్టనట్టు ప్రేమ మైకంలో మునిగితేలుతుంటారు. ఇంక అమ్మాయి కోసం అబ్బాయి చేసే స్టంట్స్ అయితే చెప్పనక్కర్లేదు. ఆమెను ఇంప్రెస్ చెయ్యడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఇంక అమ్మాయితో సరదాగా ఓ రైడ్ అంటే చాలు తన ఆనందానికి హద్దులు ఉండవు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం నగరంలో ఓ ప్రేమికుల జంట హల్ చల్ చేశారు.

సాధారణంగా బైక్‌ పై లవర్ తో జర్నీ అంటే ఓ హగ్గు ఎక్స్ పెక్స్ చేస్తుంటారు. ఇంక తననే హత్తుకుని కూర్చుండమూ చేస్తుంటారు. అయితే ఈ ప్రేమ జంట మరీ కానీ హద్దులు మీరి రెచ్చిపోయారు. యువకుడు బైక్ నడుపుతుండగా అతనికి ఎదురుగా ఆయిల్ ట్యాంక్‌పై యువతి ఆ అబ్బాయిని హత్తుకుని కూర్చుంది. ఇంక దానితో రెచ్చిపోయిన తను లవర్ ట్రాఫిక్ నిబంధనలు ప్రపంచాన్ని మరచి రయ్.. రయ్ మంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ రోడ్ పై దూసుకెళ్లారు. బైక్‌పై ప్రేమికులు ఇలా వెళ్లడాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోతూ ఇదెక్కడి వింతరా బాబు మరీ రోడ్డుపై ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ వారి వెనుక కారులో వస్తున్న ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియా షేర్ చేశారు. ఇక దీన్ని చూసిన నెటిజన్లు కలికాలమంటూ అంటున్నారు. ఇక ఈ వీడియోపై స్పందించి విశాఖ పోలీసులు ఆ ఇద్దరు ప్రేమికులను వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిచేశారు.

ఇదీ చదవండి: గన్‌లో బుల్లెట్ లోడ్ చేయడం రాని ఎస్సై.. ఐజీ తనిఖీలో బుక్కయిన పోలీసులు

 

 

Exit mobile version