Crime News: భారతదేశంలో వివిధ మతాలు, వివిధ ఆచారాలు ఉన్నప్పటికీ అందరూ వివాహ బంధానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ఏ మతంలో అయిన కానీ వివాహం అనేది వెయ్యేళ్ళ బంధంగా భావిస్తూ జీవిత భాగస్వామిని స్వీకరిస్తాం. కానీ ప్రస్తుత కాలంలో కొందరు చేసే పనులు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంటున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడి మోసలకు పాల్పడుతూ రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఘటనలను మనం నిత్యం వార్తల్లో గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనల్లో అధికంగా మగవారే ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కొందరు కిలేడీ లు మగవారికి తామేం తక్కువ కాదన్నట్లు మోసలకు పాల్పడుతున్నారు. కాగా తాజాగా ఓ యువతీ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 4 పెళ్ళిళ్ళు చేసుకుని చివరికి 5 వ పెళ్లి కి కుడా రెడీ అయిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో బయటపడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… చెన్నై పరిసర ప్రాంతాల్లో అభినయ అనే యువతి తన కుటుంభ సభ్యులతో కలసి నివసిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఆలోచిస్తూ తన అందాన్నే ఆసరాగా చేసుకొని సెంథిల్ కుమార్ అనే వ్యక్తి సాయంతో నిత్య పెళ్లి కూతురు గా మారి వరుస పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రారంభించింది. వయసు పైబడినా పెళ్లి కానీ వ్యక్తులను టార్గెట్ చేసి కుమార్ సాయంతో వారి వివరాలను సేకరించి మాయ మాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకునేది.
ఆ తర్వాత అందినంత డబ్బు, బంగారం దోచుకుని అక్కడి నుంచి పరారయ్యేది. ఈ తరుణంలోనే వరుసగా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకొని వారిని మోసం చేసిన అభినయ … చివరికి పోలీసుల చేతికి చిక్కింది. తమిళనాడు లోని కొరుక్కుపెట్ పరిసర ప్రాంతాల్లో మరో పెళ్లి చేసుకోబోతున్న ఈమెను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈమెకు సహకరించిన సెంథిల్ కుమార్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది.