Social Media Influencers: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మంత్రి కల్వకుంట్ల తారక రామరావు మరో ఘనత సాధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితం చేసే వారి జాబితాలో కేటీఆర్ చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన మెుదటి 30 మందిలో మంత్రి స్థానం సంపాదించుకున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ (Minister Ktr) అరుదైన ఘనత సాధించారు.
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితం చేసే జాబితాలో చోటు సంపాదించారు.
భారత దేశం నుంచి ఇద్దరు యువనేతలు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అందులో ఒకరు మంత్రి కేటీఆర్ అవ్వగా.. మరొకరు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా.
ఈ ఇద్దరిలోనూ కేటీఆర్ మందు వరుసలో ఉన్నారు. ఐ
టీ శాఖ మంత్రిగా తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు.
అందుబాటులో ఉండే మంత్రిగా కేటీఆర్ మంచి పేరు తెచ్చుకున్నారు.
ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ.. సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తుంటారు కేటీఆర్.
అటు అధికారిక.. ఇటు వ్యక్తిగత రెండు ఖాతాల్లోనూ చురుగ్గా ఉంటారు.
ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి అహర్నిసలు శ్రమిస్తున్నారు.
అటు అఫిషియల్, ఇటు పర్సనల్ అకౌంట్ ఇలా రెండింటిలోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో నిలిచారు.
టాప్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లిస్టులో మంత్రి కేటీఆర్ కు చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మంత్రి కేటీఆర్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ కు ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలంతా అభినందనలు తెలుపుతున్నారు.
కేటీఆర్ కు చోటు దక్కడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సమస్యల్ని వెంటనే పరిష్కరించేలా కేటీఆర్ చర్యలు తీసుకుంటారంటూ అభిమానులు చెబుతున్నారు.
పేదలకు అండగా ఉంటూనే.. యువతను మోటివేట్ చేస్తూ ఉంటారు కేటీఆర్. దీంతో ఆయనను అనుసరించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/