Cm Kcr: కేంద్రంలో అధికారంలోకి రాగానే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని.. కేసీఆర్ అన్నారు. ఖమ్మం సభా వేదికగా మాట్లాడిన కేసీఆర్.. కేంద్రంపై విరుచుకుపడ్డారు.
దేశంలో కావాల్సినన్ని వనరులు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకుంటే విదేశీ రుణాలపై ఆధారపడాల్సిన పనిలేదని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (Cm Kcr )సంచలన ప్రకటన చేశారు.
అధికారంలో రాగానే.. దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందజేస్తామని తెలిపారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ రంగంలోనే ఉంచాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
దేశంలో దళితబంధు పథకాన్ని ఏడాదికి 25 లక్షల కుటుంబాలకు అందించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం అమలు చేయకుంటే.. తాము అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.
దేశ రాజకీయాల్లో మార్పుకు ఖమ్మం బీఆర్ఎస్ సభ ఒక సంకేతమని కేసీఆర్ అన్నారు.
బీజేపీది ప్రైవేటైజేషన్.. బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్..
కేంద్ర ప్రభుత్వం పాలనలో దేశంలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అన్నారు.
అరాచక శక్తుల పాలనలో భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోతుందని అన్నారు. దేశ మార్పునకు ఈ సభ సంకేతమన్నారు.
దేశంలో సరిపడా వనరులు ఉన్నా.. వాటిని భాజపా నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు.
దేశంలో 83 కోట్ల సాగు అనుకూల భూములు ఉన్న కూడా.. యాచకులుగానే ఎందుకు ఉండాలని ప్రశ్నించారు?
ఇకనైనా మేల్కొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ సభ నిర్వహించినట్లు తెలిపారు.
ప్రపంచ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే మనం ఇంకా ఇక్కడ నీటి కోసం కోట్లాడుకుంటున్నామని అన్నారు.
రాష్ట్రాల మధ్య కేంద్రం కావాలానే కొట్లాటలు పెడుతుందని ఆరోపించారు. రాష్ట్రాల మధ్య ఈ సమస్యలకు కాంగ్రెస్, బీజేపీనే కారణమని ఆరోపించారు.
బీజేపీది ప్రైవేటైజేషన్ అయితే బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్ అని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కరెంట్ కోతలు ఉన్నాయని.. బీజేపీ అమలు చేయకపోతే పథకాలను బీఆర్‌ఎస్ అమలుచేస్తుందని ఆయన అన్నారు.
ఎల్‌ఐసీని అమ్మేయ్.. ఫర్వాలేదు. మేము మళ్లీ వెనక్కి తీసుకొస్తామని.. ఎల్‌ఐసీ ఉద్యోగులు సింహాల్లా గర్జించాలని ఆయన తెలిపారు.
2024 తర్వాత మోడీ ఇంటికి.. మేము ఢిల్లీకి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని హమీ ఇచ్చారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/