Director K Viswanath : భారతీయ సినీపరిశ్రమలో టాలీవుడ్ పేరు వినబడేలా చేసిన దర్శకుల్లో కె విశ్వనాథ్ ఒకరు.
భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి కళాతపస్వి అనిపించుకున్నారు దర్శకుడు విశ్వనాథ్.
ఇక అయన తెరకెక్కించిన శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారాన్ని అందుకొని తెలుగుతెరపై ఒక మైలురాయిగా నిలిచింది.
ఇలా ఒకటి ఏంటి.. స్వాతిముత్యం, సాగరసంగమం, స్వయంకృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల ప్రతి చిత్రం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఇంతటి గొప్ప చిత్రాలు అందించినందుకు భారతీయ ప్రభుత్వం కూడా ఆయన్ని పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్‌ని బాగా తృప్తి పరిచిన సినిమా ఏదని ప్రశ్నించగా, విశ్వనాథ్ బదులిస్తూ.. “కళాకారుడు అనేవాడు జీవితాంతం తృప్తి పొందాడు.
ఇంకా ఏదో చేయాలి, సాధించాలనే అసంతృప్తితోనే బ్రతుకుతాడు.
నేను అంతే, కానీ నన్ను మానసికంగా చాలా బాధపెట్టిన సినిమా మాత్రం ‘సిరివెన్నెల’ అని బయటపెట్టారు.
అసలు ఒక మాటలు రాని అమ్మాయి ఏంటి, కళ్ళు కనబడని అబ్బాయి ఏంటి, వారిద్దరి మధ్య సన్నివేశాలు క్రియేట్ చేయడానికి నేను రాత్రి పగలు కష్టపడడం ఎందుకు.
ఆ కథ ఎందుకు మొదలు పెట్టానో అని ఎంతో బాధ పడ్డా. చిత్రీకరణ మధ్యలో ఉన్నప్పుడు అటు ముగించలేను, ఇటు సినిమాని ఆపేయలేను. ఆ సమయంలో చిత్రవధ అనుభవించా” అంటూ తెలియజేశారు.
అయితే చివరికి ఆ సినిమా తెలుగుతెరపై ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది.
గుంటూరు జిల్లా రేపల్లెలో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని విశ్వనాథ్ జన్మించారు.
గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు.
విశ్వనాథ్ తండ్రి చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో పనిచేసేవారు.
దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తికాగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించారు.
(Director K Viswanath) దర్శకుడిగా..
పాతాళభైరవి సినిమాకు తొలిసారి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు కూడా పని చేశారు.
1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కె.విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు.. విశ్వనాథ్ 50కిపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం, ఆపద్భాందవుడు వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు.
బాలీవుడ్‌లో 9 సినిమాలకు దర్శకత్వం వహించారు.
చివరిగా అల్లరి నరేష్ హీరోగా శుభ సంకల్పం సినిమా తెరకెక్కించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/