Site icon Prime9

Death Certificate advertisement: “నా డెత్ సర్టిఫికేట్ పోయింది”.. వైరల్ అవుతున్న పేపర్ ప్రకటన..!

Death Certificate advertisement

Death Certificate advertisement

Death Certificate advertisement: చాలా మంది వారు కనపడడం లేదు.. వీరు కనపడడం లేదు.. ఏదైనా వస్తువులను దొంగలిచినట్టు.. లేదా చదువుకున్న సర్టిఫికేట్లు పోగొట్టుకున్నాం దొరికితే ఫలానా అడ్రస్కు పంపండి అంటూ పేపర్ల ద్వారానో లేదా సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుండడం చూసాం. కానీ ఒక వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా ‘తన మరణ ధృవీకరణ పత్రం’ పోయిందంటూ పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

అస్సాంకు చెందిన రంజిత్‌ కుమార్‌, ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు నాగాన్‌లోని లుమ్డింగ్ బజార్ వద్ద ‘తన మరణ ధృవీకరణ పత్రం’పోగొట్టుకున్నట్టు ఆ ప్రకటన పేర్కొన్నాడు. ఆ డెత్‌ సర్టిఫికేట్‌ నంబర్‌ కూడా అందులో తెలిపాడు. ఐపీఎస్‌ అధికారి రుపిన్ శర్మ ఈ పేపర్‌ ప్రకటన ఫొటోను ట్విట్టర్‌ ద్వారా ఆదివారం పోస్ట్‌ చేశారు. దీంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరోవైపు తన డెత్‌ సర్టిఫికేట్‌ను కోల్పోయినట్లు రంజిత్‌ కుమార్‌ పేపర్‌లో ఇచ్చిన ఈ ప్రకటనపై నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి స్వర్గంలో ఉన్నాడా? లేక నరకంలో ఉన్నాడా? అని కొందరు అడిగారు. ఒకవేళ ఆ ‘మరణ ధృవీకరణ పత్రం’ ఎవరికైనా దొరికితే ఎక్కడికి పంపాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Tirupati Tiktok Couple Marriage: టిక్‌టాక్‌ ప్రేమకథా చిత్రం… భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య..!

Exit mobile version